లభ్యతలో జియో ఫస్ట్, 4G స్పీడులో ఎయిర్టెల్ ఫస్ట్ : Ookla

Updated on 13-Feb-2019
HIGHLIGHTS

Ookla సంస్థ ఇచ్చిన 2018 Q3 మరియు Q4 జాబితా.

స్పీడ్ టెస్ట్ కంపెనీ అయినటువంటి Ookla సంస్థ 2018 యొక్క Q3 మరియు Q4 గాను ఇటీవలి నివేదికను విడుదల చేసింది. ఇది విడుదల చేసిన జాబితా భారతదేశంలో 4G యొక్క లభ్యత మరియు వేగం గురించి మీకు తెలియజేస్తుంది. ఈ నివేదిక, భారతదేశం యొక్క 4G లభ్యతను విశ్లేషిస్తుంది, ఇందులో 15 ప్రధాన నగరాలు ఉన్నాయి. దీని ప్రకారం,  ముఖేష్ అంబానీ సొంత కంపెనీ అయిన, రిలయన్స్ జియో, 15 ప్రధాన నగరాల్లో దాని 98.8% లభ్యత(Availability) తో అగ్రస్థానంలో ఉంది.

అలాగే,  90% లభ్యతతో ఎయిర్టెల్ రెండవ స్థానంలో నిలచింది. అదే సమయంలో, వోడాఫోన్ 84.6% మరియు ఐడియా 82.8% లభ్యతతో నేడు మరియు నాల్గవ స్థానాల్లో వరుసగా నిలిచాయి. ఇక 4G స్పీడ్ విషయానికి వస్తే, ఎయిర్టెల్ 4G ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలచింది . Ookla డౌన్లోడ్ మరియు అప్లోడ్ పైన చేసిన పరీక్షల ఆధారంగా, 11.23Mbps యొక్క వేగంతో ఎయిర్టెల్ 4G 2018 యొక్క మూడవ మరియు నాల్గవ త్రైమాసికంలో మొదటి స్థానంలో నిలచింది.

అదే సమయంలో, వోడాఫోన్ తన 9.9 Mbps స్పీడుతో రెండవ స్థానంలో నిలవగా, జియో మరియు ఐడియా వరుసగా మూడవ మరియు నాలుగ స్థానాల్లో నిలిచాయి. సాధారణ లభ్యతపై విషానికి వస్తే,  జియో నెట్వర్క్ వినియోగదారులకి 99.3% లభ్యత అందిస్తోంది. అదే సమయంలో,99.1% లభ్యతతో ఎయిర్టెల్ రెండవ స్థానంలో నిలవగా,  99,0% మరియు 98,9% సాధారణ లభ్యతతో వోడాఫోన్ మరియు ఐడియా వరుసగా మూడు మరియు నాలుగు స్థానాల్లో నిలచాయి. 

సాధారణ లభ్యత అనగా, ఒక వినియోగదారునికి రొమింగుతో సహా ఎలాంటి సేవలకైనా సరే టెలికం ఆపరేటర్ అందించే యాక్సెస్ యొక్క శాతం.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :