జియో ఫైబర్ సర్వీస్ మరియు ప్లాన్స్ ప్రకటించిన JIo సంస్థ

Updated on 05-Sep-2019
HIGHLIGHTS

అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు,  ఈ సర్వీస్ యొక్క సబ్ స్క్రిప్షన్ గురించిన అన్ని ప్లాన్ల  వివరాలను వెల్లదించింది. ప్రస్తుతం, భారతదేశంలోని 1600 నగరాల్లో జియోఫైబర్ అందుబాటులో ఉంది మరియు జియో వాగ్దానం చేసినట్లుగా, దాని సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ రూ .699 నుండి ప్రారంభమవుతాయి మరియు కనిష్ట వేగం 100 MBPS వరకు అందిస్తాయి. ఇక్కడ, ఈరోజు రిలయన్స్ జియోఫైబర్  వెల్లడించిన అన్ని కొత్త విషయాలను మరియు సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. అదనంగా, JioFiber ప్లాన్లతో పాటు, Jio ఉచిత ఫిక్సిడ్ ల్యాండ్‌లైన్, OTT యాప్ ఉచిత సబ్ స్క్రిప్షన్ మరియు ఇటువంటి మరిన్ని రాబోయే కొన్ని JioFiber సర్వీసులను కూడా వివరించింది.

 

రిలయన్స్ జియోఫైబర్ ప్లాన్స్

JioFiber యొక్క ప్లాన్స్ గురించి చూస్తే,  పైన చెప్పినట్లుగా, అవి 699 రూపాయల నుండి ప్రారంభమవుతాయి మరియు 100Mbps వరకు వేగాన్ని అందిస్తాయి. కొత్త కస్టమర్లు డిపాజిట్ ఛార్జీగా రూ .2,500 చెల్లించాల్సి ఉంటుంది, వీటిలో 1500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అయితే రూ .1000 నాన్ రిఫండబుల్ (తిరిగి చెల్లించని) ఇన్స్టాలేషన్ చార్జీలు. 'Bronze' అని పిలువబడే రూ .699 బేస్ ప్లాన్‌కు సభ్యత్వం పొందిన వినియోగదారులు అపరిమిత డేటాను ఉపయోగించుకుంటారు, అయితే ఇది 100GB + 50 GB వరకు అధిక వేగంతో(హై -స్పీడ్) నడుస్తుంది. ఈ డేటా యొక్క లిమిట్ ( పరిమితి) తరువాత, 1Mbps వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలుగుతారు. అలాగే, ఈ అదనపు డేటాను ఆరు నెలల పాటు పరిచయ ప్రయోజనంగా అందిస్తున్నారు. 1Mbps స్పీడ్ క్యాప్ యొక్క పేర్కొన్న FUP అన్ని JioFiber ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లకు వర్తిస్తుందని గమనించండి.

తదుపరిదిగా 'Silver' అని పిలువబడే రూ .849 ప్రీపెయిడ్ జియో ఫైబర్ ప్లాన్ ఉంటుంది. ఈ రీఛార్జ్ ఎంపిక పరిచయ ఆఫర్‌లో భాగంగా 200GB హై-స్పీడ్ డేటాను క్రెడిట్ చేస్తుంది. రూ .699 బ్రోన్జ్ ప్లాన్ మాదిరిగానే, ఇక్కడ వేగం 100 Mbps కి సెట్ చేయబడింది.

ఇక ,299 గోల్డ్ ప్రీపెయిడ్ ప్లాన్ 250 Mbps వేగంతో 500 GB  నెలవారీ డేటాను అందిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, సంస్థ  250GB అదనపు పరిచయ డేటాను ఇస్తోంది.రూ .2,499 డైమండ్ జియో ఫైబర్ ప్లాన్‌కు విషయానికి వస్తే,  ఇది 500 Mbps వేగంతో 1250 GB నెలవారీ డేటాను అందిస్తుంది. పరిచయ ఆఫర్‌లో భాగంగా ఆరు నెలల పాటు 250GB అదనపు ఉచిత డేటా కూడా ఉంది.

అధిక బ్యాండ్‌విడ్త్ మరియు డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం, 3,999 రూపాయల ప్లాటినం ప్లానుతో 2500GB పరిమితితో, ఏకంగా 1Gbps వేగాన్ని అందిస్తుంది. చివరగా, టైటానియం జియోఫైబర్ ప్లాన్ ఉంది, దీని ధర రూ .8,499 మరియు 5000 GB డేటాకు 1Gbps వేగంతో అందిస్తుంది. ముందే చెప్పినట్లుగా, కేటాయించిన డేటా అయిపోయిన తర్వాత ఈ ప్లాన్‌లన్నింటికీ 1Mbps FUP ఉంటుంది.

పైన పేర్కొన్న ప్రీపెయిడ్ జియోఫైబర్ ప్లాన్‌లన్నీ ఉచిత వాయిస్ బెనిఫిట్‌తో వస్తాయి మరియు టీవీ వీడియో కాలింగ్‌ను అందిస్తాయి. 'జీరో-లేటెన్సీ' గేమింగ్ మరియు కంటెంట్ షేరింగ్ వంటి హోమ్ నెట్‌వర్కింగ్ సేవ కూడా జియోఫైబర్ ఇంటర్నెట్ సేవతో చేర్చబడతాయి. ఈ సర్వీస్ గురించి గమనించవలసిన మంచి పాయింట్  ఏమిటంటే ఇది నార్టన్ డివైజ్ సేఫ్టీ తో వస్తుంది, ఇది 5 పరికరాల వరకు అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :