పోటీ ధరల ప్రణాళికలతో, జియో బ్రాండ్ పేరుతో రిలయన్స్ జియో యొక్క బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ లు గురించి ప్రకటించినప్పుడు మార్కెట్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇలాంటి ప్రకంపనలు మరొకసారి మార్కెట్ ను తాకాయి. అయితే, ఇప్పుడు జియో కాదు ఇవి శ్రీష్టించింది,జియో కి గట్టి పోటీదారు అయినటువంటి Hathway సంస్థ. ఈ బ్రాడ్ బ్యాండ్ సంస్థ, హఠాత్తుగా కోల్‌కతా మరియు ఇతర నగరాల్లో నెలకు కేవలం 699 రూపాయల రేటుకే 100Mbps వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుని అందించడానికి పూనుకుంది. జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల గురించి రిలయన్స్ అధికారికంగా ప్రకటించిన కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే టెలికాం టాక్ ఇచ్చిన తాజా నివేదిక నుండి ఈ రేటు తగ్గింపు వార్త వచ్చింది.
ఈ నివేదిక ప్రకారం, హాత్వే యొక్క 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలవారీ ఫెయిర్-యూజ్ పాలసీ (FUP) లేదా 1TB యొక్క డేటా క్యాప్ తో వస్తుంది. కోల్‌కతా మరియు ఇతర నగరాల్లో దీని ధర నెలకు రూ .699. కానీ చెన్నై వంటి మరికొన్ని నగరాల్లో మాత్రం ఇదే ప్లాన్‌కు నెలకు రూ .949 చెల్లించాల్సివుంటుంది. వీటితో పాటు, హాత్వే 150Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా కలిగి ఉంది, అదే 1TB నెలవారీ FUP తో నెలకు 1,499 రూపాయలు. ఎంచుకున్న పట్టణాల్లో లైఫ్‌లాంగ్ బింగే వంటి ఆఫర్‌లను కూడా ఈ ISP కలిగి ఉంది, ఇది వినియోగదారులకు 50Mbps జీవితకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను నెలకు 399 రూపాయలకు ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.
సంస్థ యొక్క 42 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆగస్టు 12 న రిలయన్స్ తన జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవను భారతదేశంలో అధికారికంగా ప్రకటించిన తరువాత హాత్వే 100Mbps ప్రణాళిక కోసం ధరను సగానికి సగం తగ్గించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ టెలికాం సంస్థ ఇప్పుడు సుమారు ఒక సంవత్సరం పాటు జియోఫైబర్ ట్రయల్స్ నిర్వహిస్తోంది మరియు సెప్టెంబర్ 5 న ఈ సేవను అధికారికంగా విడుదల చేస్తుంది. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క ధరను 700 నుండి 10,000 రూపాయల మధ్య ఉంటుందని నిర్ధారించింది. 1TB వరకు నెలవారీ FUP తో 100Mbps కనెక్షన్‌ను బేస్ ప్లాన్ అందిస్తుందని భావిస్తున్నారు.
చివరకు సెప్టెంబరు ఆరంభంలో ఈ సేవలు ప్రసారం అయినప్పుడు, JioFiber కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ఫిక్స్డ్ – లైన్ టెలిఫోన్ సేవ కంటే ఎక్కువ ప్రయోజనాలను వినియోగదారుల ఇంటికి తీసుకువస్తుందని భావిస్తున్నారు. కొన్ని ప్రణాళికల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) మీడియా సేవలు కూడా ఉంటాయి. రిలయన్స్ ఒక జియో 4 K సెట్ టాప్ బాక్స్‌ను కూడా ప్రకటించింది, దీనితో కన్సోల్ లాంటి గేమింగ్ సేవ మరియు జియో ఫైబర్‌కు సంవత్సర చందా తీసుకునే వినియోగదారుల కోసం ఉచిత LED టివి కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.