JIO యూజర్ల ప్రీపెయిడ్ ప్లాన్స్ ముగిసినా.. ఇన్ కమింగ్ కాల్స్ వస్తాయి

JIO యూజర్ల ప్రీపెయిడ్ ప్లాన్స్ ముగిసినా.. ఇన్ కమింగ్ కాల్స్ వస్తాయి
HIGHLIGHTS

వినియోగదారులకు వ్యాలిడిటీ పొడిగింపును ప్రకటించాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పొడిగించిన లాక్ డౌన్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని,  మే 3 వ తేదీ వరకు ఇన్కమింగ్ కాల్ వ్యాలిడిటీని  మే 3 వ తేదీ వరకు పొడిగించినట్లు జియో తెలిపింది. ముందుగా, బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులందరికీ కూడా మే 5 వరకూ  ఇన్ కమింగ్ ఫ్రీ అని ప్రకటించిన తరువాత,  జియో యొక్క ఈ కొత్త ప్రకటన వచ్చింది. అంతేకాదు, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కూడా తమ తక్కువ ఆదాయ వినియోగదారులకు వ్యాలిడిటీ పొడిగింపును ప్రకటించాయి. అంతేకాదు, ఈ నాలుగు టెలికం సంస్థలు   కూడా ప్రీపెయిడ్ ఖాతాలను ఇంట్లో వుండే రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

కొత్త అప్డేట్ ప్రకారం, లాక్డౌన్ సమయంలో జియో వినియోగదారులు ఎటువంటి రీఛార్జ్ అవసరం లేకుండానే ఇన్‌ కమింగ్ కాల్స్  ను స్వీకరిస్తూనే ఉంటారు. అయితే, ఇతర టెలికం సంస్థల మాదిరిగా ఒక నిర్దిష్ట గ్రూప్ కి మాత్రమే పరిమితం కాదని, వినియోగదారులందరికీఇది  ఒకేవిధంగా అందించబడుతుందని జియో పేర్కొంది. ఇది ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాకు విరుద్ధంగా ఉంది, ఈ రెండూ సంస్థలు కూడా కేవలం తక్కువ-ఆదాయ వినియోగదారులకు మాత్రమే ఈ ప్రత్యేకంగా పొడిగించిన ఇన్‌కమింగ్ కాల్ వ్యాలిడిటీని  అందిస్తున్నాయి.

అంటే, మే 3 తేదీ లోపుగా ప్లాన్స్ యొక్క వ్యాలిడిటీ ముగిసినా కూడా ఇన్ కమింగ్ కాల్స్ మాత్రం కొనసాగుతాయి. దీని వలన, ఈ సంక్షోభ సంశయంలో ప్లాన్ ముగిసిన వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వారికీ కొంత ఉరట లభిస్తుంది. అంతేకాదు, ఇంటి నుండి రీఛార్జ్ చేసుకోవడానికి మరియు బ్యాంకు ATM ద్వారా కూడా రీఛార్జ్ చేసుకునేలా కూడా కొత్త అవకాశాలను తీసుకొచ్చింది.             

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo