jio ఎఫెక్ట్ : త్వరలో భారతీ ఎయిర్టెల్ తన 3G సేవలను నిలిపివేసి కేవలం 4G సేవలను మాత్రమే కొనసాగించనుంది

jio ఎఫెక్ట్ : త్వరలో భారతీ ఎయిర్టెల్ తన 3G సేవలను నిలిపివేసి కేవలం 4G సేవలను మాత్రమే కొనసాగించనుంది
HIGHLIGHTS

రోజురోజుకు పెరుగుతున్న 4G యొక్క గణనీయ వినియోగం వలన పూర్తి సేవలను 4G కి అంకితం చేయనున్నట్లు, భారతీ ఎయిర్టెల్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు, మరియు స్వచ్ఛమైన 900Mhz బ్యాండ్ కేవలం తన 4G వినియోగదారులకి మాత్రమే అందించగలమని కూడా పేర్కొన్నారు.

భారతదేశంలో కేవలం 4G సేవలను మాత్రమే అందిస్తూ, ఉన్నత స్థానంలోకి దూసుకెళుతున్న jio ని అనుసరిస్తూ ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ కూడా కేవలం 4G సేవలకు మాత్రమే అంకితంకానున్నరెండవ అతిపెద్ద టెలికామ్ సంస్థగా అవతరించడానికి సిద్ధమవుతోంది. కంపెనీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన, గోపాల్ విట్టల్ ప్రకారంగా, ఇప్పటి వరకు కేవలం 2G సర్వీసులకు మాత్రమే వాడుకలోవున్న,  నాలుగవ తరం వాయు తరంగాలైన 900Mhz బ్యాండ్ ని ఇపుడు 4G కి కూడా విస్తరించనునట్లు తెలిపారు.  ఇప్పటికే ఎయిర్టెల్,  900Mhz బ్యాండ్ వాయుతరఁగాలని దేశాప్యప్తంగావున్న16 సిర్కిళ్లలో 116 యూనిట్లలో అందిస్తున్నట్లు The Economic Times తెలిపింది. అయితే, ఈ విధానంవలన కేవలం 3G సేవలు మాత్రమే నిలిపివేయబడతాయి, కానీ 2G సేవల పైన ఎటువంటి ఇబ్బంది ఉండదు.

"4G డిమాండ్ రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నట్లు మేము గమనించాము మరియు ఈ సమయంలో 900Mhz బ్యాండ్ స్వచ్ఛముగా 4G కస్టమర్లకు అందించబడుతుంది. అయితే, 2G సేవలు మాత్రం 1800Mah బ్యాండ్ తో అంతరాయంలేకుండా కొనసాగుతాయి" అని విట్టల్ పేర్కొన్నారు. అలాగే, ఈ పరివర్తనలో భాగంగా ముందస్తు వ్యూహాలను కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలిపారు. అంతేకాకుండా, ఇప్పుడు అంతంత మాత్రంగానే వున్నా 3G సేవలు త్వరలోనే మరుగునపడవచ్చనే మాటలని కూడా జోడించారు.

 ET ప్రకారం, కర్ణాటకలో స్థిరమైన 900 Mhz బ్యాండ్ ని 4G వినియోగదారులకి అందిస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది మరియు దీనిని త్వరలోనే అన్ని ప్రాంతాలకి విస్తరించనున్నట్లు కూడా తెలుపుతోంది తద్వారా తన యొక్క 4G వినియోగదారులని పెంచుకునే వీలుంటుంది. అలాగే, 900Mhz బ్యాండ్ కి సపోర్ట్ చేయగల 4G ఫోన్ల తయారీ కోసం షావోమితో సాన్నిహిత్యంగా పనిచేయనున్నట్లు, విట్టల్ వివరించారు. ఇటీవలే, ఎయిర్టెల్ కొత్త Rs. 398 ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది, దీనితో రోజువారీ 1.5GB 4G డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 90 SMS పరిమితితో 70రోజుల చెల్లుబాటుతో వస్తుంది.                                        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo