జియో మహత్యం : అతితక్కువ ధరకే డేటా అందిస్తున్న వాటిలో అగ్రస్థానంలో భారతదేశం
UK సంస్థ అందించి రిపోర్టులోని అంశాలను చుస్తే, నిజంగా డేటా విలువ తెలుస్తుంది.
జియో టెలికం రంగంలో అడుగుపెట్టక ముందు, మనకు డేటా కార్డు కొనాలంటే భయమేసేది. ఎందుకంటే, అప్పట్లో అన్ని టెలికం సంస్థలు కూడా అధికమైన ధరలతో వాటి డేటా ప్లాన్లను అందించేవి. అయితే, దూకుడుతో వచ్చిన జియో, ఏకంగా ఉచితంగా డేటాని ప్రజలకు అందించేసరికి, అన్ని కంపెనీలు కూడా ఒక్క సరిగా కిందకు దిగి వచ్చాయి. అన్ని టెలికం సంస్థల నుండి ఏదో ఒక ప్లాన్ రావడమో లేక ఉన్న ప్లాన్స్ పైన మార్పులు చేయడమో ప్రస్తుతం మనం గమనిస్తుంటాము. అన్ని కూడా వినియోగదారులను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగానే, మనకు కనిపిస్తాయి.
కానీ, ప్రపంచవ్యాప్తంగా ఈ ధరలు ఎలావున్నాయో మనకు తెలియదు. అయితే, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వున్నా ప్లాన్స్ ని పరిగణలోకి తీసుకొని ఒక UK సంస్థ అందించి రిపోర్టులోని అంశాలను చుస్తే, నిజంగా డేటా విలువ తెలుస్తుంది. ఈ సంస్థ అందించిన రిపోర్ట్ చుస్తే ఇతర దేశాల్లో టెలికం సంస్థలు యెంత రేటుకు డేటాని అందిస్తున్నాయి తెలిశాక, జియో ని పొగడకుండా ఉండలేము.
cable.co.uk ప్రకారం, ప్రపంచంలో అతితక్కువ ధరకి డేటా లభిస్తున్నదేశాలలో భారతదేశానికి మొదటి స్థానం దక్కింది. అంటే, ప్రపంచంలో అందరికంటే ట్టకువ ధరకి మనం డేటాని అందుకుంటున్నామన్నమాట. ఒక GB డేటా కోసం, కేవలం $ 0.26 (18.34 రూపాయలు) ధర చల్లిస్తున్నాము. ఇక రెండవ స్థానంలో క్యాగేస్తాన్ నిలవగా మూడు మరియు నాలుగు స్థానాల్లో, మరియు కజకిస్థాన్ మరియు ఉక్రెయిన్ లు వరుసగా నిలిచాయి.
ఇక అత్యధికమైన ధరతో డేటాని అందిస్తున్న దేశాలలో, అగ్రరాజ్యాలతో పాటుగా టెక్ దిగ్గజాలను కలిగిన దేశాలు కూడా ఉండడం విశేషం. ఇందులో అమరికా సంయుక్త రాష్ట్రాలు 185 స్థానాన్ని సాధించగా చైనా 165 వ స్థానంలో నిలచింది. టక్నాలజీని, అమితంగా ఆదరిస్తున్న ఇండియా ఇప్పుడు అన్ని దేశాల చూపును తనవైపుకు తిప్పుకుంటోంది. అంతేకాదు, మొబైల్ రంగంలో కూడా అత్యధికంగా అమ్మకాలను సాధిస్తున్న అతిపెద్ద కంపెనీలు కూడా వారి ప్రొడక్టులను ఎక్కువగా అమ్ముతోంది ఇండియాలోనే కావడం విశేషంగా చెప్పవచ్చు.