జియో ఫైబర్ ఎఫెక్ట్ : రోజుకు 33 GB డేటా ప్లాన్ ప్రకటించిన BSNL
జియోఫైబర్‌లకు పోటీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బిఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా కొన్ని సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది
చాలా కాలం అందరిని ఊరించిన తరువాత, ఎట్టకేలకు ఈ నెల 5 వ తేదికి రిలయన్స్ తన రిలయన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ ప్రణాళికల ధర మరియు ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిపోయింది. ఇప్పుడే, మీరు రిలయన్స్ జియోఫైబర్ కనెక్షన్‌ను బుక్ చేసుకోవచ్చచ్చు.
అయితే, ఈ ప్రణాళికలు మార్కెట్లోకి తీసుకొచ్చి కూడా చాలా కాలం కాలేదు. కానీ, వీటి కారణంగా మార్కెట్లో పోటీ చాలా వేగంగా పెరుగుతోంది. జియోఫైబర్‌లకు పోటీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బిఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా కొన్ని సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది మరియు ఈ ప్లాన్ ధర 1,999 రూపాయలుగా ప్రకటించింది. అంతేకాదు, ప్లానుతో గొప్ప ఆఫర్లను మరియు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ రోజు వీటి గురించి తెలుసుకుందాం.
బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ రూ .1,999 ప్లాన్
ఈ కొత్త BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ భారత్ ఫైబర్‌లో ఒక భాగంగా ఉంటుంది. ఈ ప్లానులో మీరు 100Mbps వేగాన్ని అందుకుంటారు. ఇది కాకుండా, మీరు ఏకంగా 33GBల రోజువారీ హైస్పీడ్ డేటాను కూడా పొందుతారు. అంటే మీకు సుమారు 30 రోజుల్లో మొత్తంగా 990GB డేటాను అందిస్తుంది. అయితే, మీ రోజువారీ పరిమితి అయిపోతే, ఈ ప్లాన్ యొక్క వేగం 4Mbps కి తగ్గించబడుతుంది. ముందుగా దీని గురించి టెలికం టాక్ నీవేదైకను అందించింది. దీని ప్రకారం, లోకల్ మరియు జాతీయ అపరిమిత కాల్స్ ని కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.
BSNL యొక్క మరికొన్ని ఇతర ప్లాన్స్
బిఎస్‌ఎన్‌ఎల్ నేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ని అందిస్తోంది. అయితే, వీటిలో ముఖ్యముగా 750 జీబీ మొత్తం డేటాతో 1,277 రూపాయల ధరతో వుండే ఒక ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇది కాకుండా, కంపెనీ 40GB రోజువారీ డేటాతో కూడా ఒక ప్లాన్‌ను కలిగి ఉంది. ఇది రూ .2,499 ధరలో వస్తుంది.
ఇది మాత్రమే కాదు, కంపెనీకి మరో రెండు ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇందులో, మొదటి ప్లాన్ రూ .4,499 ధరతో లభిస్తుంది, ఇది 55 జీబీ రోజువారీ డేటాతో వస్తుంది, మరో ప్లాన్ రూ .5,999 ధరతో వస్తుంది, ఇది మీకు 80 జీబీ రోజువారీ డేటాను ఇస్తుంది. అయితే, కంపెనీకి 90GB రోజువారీ డేటా ప్లాన్ కూడా ఉంది, వీటిని మీరు సుమారు 9,999 రూపాయలకు లభిస్తుంది.