జియో ఎఫెక్ట్ : Jio బాటలోనే డిసెంబర్ నుండి ధరలు పెంచనున్న టెలికం సంస్థలు
వోడాఫోన్ ఐడియా మరియు భారతీ ఎయిర్టెల్ తమ టారిఫ్ ల ధరలను పెంచనున్నాయి.
జియో టెలికం రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ కూడా టెలికం రంగంలో కొనసాగుతున్న అనిశ్చితి ఇంతవరకు కుదుటపడలేదు. ఇప్పటి వరకూ ఉచితం, ఉచితం అంటూ పరిగెత్తిన కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా దారి మళ్లుతున్నాయి. ముందుగా, ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ కి డబ్బును చెల్లించాలని జియో ప్రకటించగా, ఇప్పుడు ప్రాధాన టెలికం సంస్థలైనటువంటి వోడాఫోన్ ఐడియా మరియు భారతీ ఎయిర్టెల్ వంటివి కూడా తమ టారిఫ్ ల ధరలను పెంచనున్నట్లు భావిస్తున్నారు.
వాస్తవానికి, ఈ ధరల పైన ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇప్పటి వరకు ఈ రెండు ప్రధాన టెలికం సంస్థలు రూ.80,000 కోట్ల రుపాయల పైగా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నట్లు సుప్రీం కోర్టు తెలిపిన విషయం తెలిసిందే. ఈ బకాయిలను చెల్లించడానికి మరియు ఆర్ధిక ఇబ్బదుల నుండి గట్టెక్కడానికి ఈ టెలికం సంస్థలు కొత్త రెవిన్యుని జనరేట్ చెయ్యలేవు కాబట్టి, టారిఫ్ ను పెంచడం ద్వారా రెవిన్యూను వృద్ధి చెయ్యవచ్చు. కాబట్టి, ఈ టెలికం సంస్థలు ఈ విధంగా చేయడానికి పూనుకోనున్నాయి.
అలాగే, వోడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్టెల్ రెండూ కూడా విడివిడిగా ఇచ్చిన మీడియా స్టేట్మెంట్ లో డిసెంబర్ 1, 2019 నుండి తమ ప్రస్తుత టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే, ఈ ధరలను ఎంతవరకూ పెంచనున్నాయన్న విషయాన్ని మాత్రం తెలియచేయలేదు. ఇక ఇవన్నీ చూస్తుంటే, ఉచితం దేవుడెరుగు ప్లాన్స్ ధరలకు కూడా రెక్కలొచ్చేలా కనిపిస్తుంది. అధికారికంగా, ధరలను వెల్లడించే వరకు వేచి చూడవలసిందే.