జియో సునామి: ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ స్పీడ్ రెట్టింపు

Updated on 23-May-2021
HIGHLIGHTS

రిలయన్స్ జియో తెలుగు ప్రజలకు శుభవార్త అందించింది

తెలుగు రాష్ట్రల ప్రజలకు మరింత మెరుగైన 4G సర్వీస్

రెట్టింపు వేగంతో తెలుగు రాష్ట్రాల్లోని జియో కస్టమర్లకు ఇంటర్నెట్

రిలయన్స్ జియో తెలుగు ప్రజలకు శుభవార్త అందించింది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో ఇంటర్నెట్ నెట్ స్పీడ్ సమస్య ఎక్కువ అవుతోంది. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగంగా చెయ్యబోతోంది. ఇటవల జరిగిన తెలుగు రాష్ట్రాల స్పెక్ట్రమ్ వేలంలో AP టెలికం కోసం కొత్త స్పెక్ట్రమ్ లను చేజిక్కించుకుంది. తద్వారా, చేస్తున్న మార్పుల ద్వారా మరింత మెరుగైన 4G సర్వీస్ లు తెలుగు రాష్ట్రల ప్రజలకు అందుతాయి.

వాస్తవానికి, ఇప్పటికే వున్నా 40MHz స్పెక్ట్రమ్ కు అధనంగా 40MHz స్పెక్ట్రమ్ ను జోడించింది. కాబటి, ఇప్పటికే కొనసాగుతున్న ఇంటర్నెట్ స్పీడ్ కి ఇది జతగా చేరుతుంది. అంటే, ప్రస్తుతం వున్నా ఇంటర్నెట్ స్పీడ్ కంటే రెట్టింపు వేగంతో తెలుగు రాష్ట్రాల్లోని  జియో కస్టమర్లకు ఇంటర్నెట్ అందుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 40% కస్టమర్ వాటా తో అగ్రస్థానంలో  కొనసాగుతున్న జియో, తన కస్టమర్లకు మరింత మెరుగైన 4G సర్వీస్ అందించే విషయంలో కూడా మరింత ముందుగా నడుస్తోంది. ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరగడం వలన ఆన్లైన్ వర్క్, ఆన్లైన్ క్లాసులు లేదా ఎక్కువగా ఇంటర్నెట్ తో ఆన్లైన్ పైన ఆధారపడే వారికీ మంచి కనెక్టివిటీ అందుతుంది.                                                  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :