ఈరోజు నుంచి మొదలైన Jio Diwali Dhamaka Offer : ఈ రీఛార్జ్ పై అధిక లాభాలు అందుకోండి.!
2024 దీపావళి పండుగ సందర్భంగా జియో కొత్త ఆఫర్ ప్రకటించింది
రిలయన్స్ జియో కొత్తగా Jio Diwali Dhamaka Offer ని అనౌన్స్ చేసింది
ఈ దివాళి ఆఫర్ ద్వారా యూజర్లు అధిక లాభాలు పొందుతారు
2024 దీపావళి పండుగ సందర్భంగా దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో కొత్తగా Jio Diwali Dhamaka Offer ని అనౌన్స్ చేసింది. రిలయన్స్ జియో అనౌన్స్ చేసిన ఈ దివాళి ధమాకా ఆఫర్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఆఫర్ ను జియో యొక్క రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఆఫర్ చేస్తోంది. ఈ దివాళి ఆఫర్ ద్వారా ఈ రెండు ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అధిక లాభాలు పొందుతారు.
Jio Diwali Dhamaka Offer
రిలయన్స్ జియో సరికొత్తగా ప్రకటించిన జియో దివాళి ధమాకా ఆఫర్ ను రూ. 899 మరియు వన్ ఇయర్ ప్లాన్ రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్స్ పై అందించింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు రూ. 3000 రూపాయలకు పైగా అధిక లాభాలు అందుతాయని జియో ప్రకటించింది.
ఏమిటా ఆఫర్స్?
ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఈ ఫెస్టివల్ సీజన్ (అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు) రీఛార్జ్ వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు EaseMyTrip.com ద్వారా బుక్ చేసే ఫ్లైట్/హోటల్ బుకింగ్ పై రూ. 3,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు, Ajio నుంచి రూ. 999 పై చిలుకు ఆర్డర్స్ పై రూ. 200 తగ్గింపు మరియు రూ. 399 పైగా చేసే Swiggy ఆర్డర్ పై రూ. 150 తగ్గింపు లభిస్తుంది. ఈ లాభాలు అందించే రెండు ప్లాన్స్ అందించే ప్లాన్ ప్రయోజనాలు క్రింద చూడవచ్చు.
Jio రూ. 899 ప్లాన్
రిలయన్స్ జియో యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు నడుస్తుంది మరియు 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా మరియు డైలీ 100 SMS లను ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 4G నెట్ వర్క్ పై రోజుకు 2GB హై స్పీడ్ డేటా మరియు 20GB అదనపు డేటా కూడా లభిస్తుంది.
Also Read: LG 9.1.5 ఛానల్ Soundbar పై భారీ డిస్కౌంట్ అందించిన Flipkart
Jio రూ. 3,599 ప్లాన్
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం నడుస్తుంది. అంటే, ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా మరియు 100 SMS లను పొందవచ్చు. 4G నెట్ వర్క్ పై ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 2.5 GB డేటా లభిస్తుంది.
మరిన్ని ఇతర ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here