మార్చి 23 నుండి మే 5 వరకు జరగనున్న IPL సందర్భంగా, జియో కూడా తన "ఖేలో క్రికెట్ జియో క్రికెట్" ని అందిస్తోంది. దీని జియో వినియోగదారులతో పాటుగా, ఇతరులు కూడా ఆదుకునే అవకాశాన్ని జియో అందించింది. ఈ జియో క్రికెట్ నుండి Live స్కోర్స్ మరియు ముందస్తు అంచనాలకు సంభందించిన ప్రశ్నలకు సరైన సమాధానాలను అందించినవారూ కొన్ని పాయింట్లను గెలుచుకోవచ్చు. అధనంగా, ఈ ఆటను ఆడే ప్లేయర్లు ఎవరైతే ట్రివియా ప్రశ్నలకు సరైన సమాధానాలను ఎంచుకుంటారో, వారికీ మంచి పాయింట్లు లభిస్తాయి.
మీరు గనుక ఒక జియో వినియోగధారులైతే, ఆప్ స్టోర్ నుండి మీ యొక్క My Jio app అప్డేట్ చేసుకోవాల్సివుంటుంది. అప్డేట్ చేసుకున్నవారికి ఈ కొత్త ఎంపిక వెంటనే లభిస్తుంది. ఒక వేళా మీరు గనుక జియో వినియోగదారులు కాకపోయినట్లైయితే, మీ నంబరును జియో కి అందించడంతో ఒక OTP లభిస్తుంది. దీనితో, జియో వినియ్ప్గదారులు కానివారు కూడా ఈ జియో క్రికెట్ ఆడుకోవచ్చన్నమాట.
ఇందులో ఒక 3 ఓవర్ల ను ఎంచుకునే పవర్ ప్లే ఆడడం ద్వారా పవర్ కార్డ్స్ గెలుచుకోవచ్చు. ఈ ప్వార కార్డుతో ఎక్కువ పాయింట్లను మీరు గెలుచుకునే అవకాశం ఉంటుంది. మరొక మంచి విషయం ఏమిటంటే, ఈ ఆటను మీకు నచ్చిన భాషలో ఎంచుకునే అవకాశం కూడా అందించింది.కాబట్టి, మీకు నచ్చిన బసహాను ఎంచుకుని మీరు ఈ ఆటను ఆడవచ్చు. అదనంగా, మేరే థర్డ్ ఎంపైర్ అవతారం ఎత్తవచ్చు , ట్రివియాలో మీకు అందించిన థర్డ్ ఎంపైర్ పెండింగ్ డెషిషన్ కు అందించిన ఎంపికలో, మీరు ఎంచుకున్న ఎంపిక సరైనదయితే మరిన్ని పాయింట్లను కూడా గెలుచుకోవచ్చు.
ఈ పాయింట్లలో ఏమిటి లాభం :
ఈ అతని ఆడతాం, పాయింట్లను కూడా గెలుచుకుంటాం మరి వీటితో మాకేంటి లాభం? ఇదేనా మీ ప్రశ్న. ఇప్పటి వరకు దినికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ చింతించకండి, ఈ ఆటలతో మీరు గెలుచుకున్న పాయింట్లను మీ జియో ఆప్ ద్వారా రిడీమ్ చేసుకునే అవకాశం, జియో అందించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, మరికొన్ని ఆశ్యర్యపరిచే బహుమతులను కూడా ఈ పాయింట్లతో అందించవచ్చని అంచనావేస్తున్నారు. అయితే, వీటిపైనా ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి, ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సి ఉంటుంది.