Jio: ఈ రెండు సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ లను జూలై 3 నుంచి తీసేస్తున్న జియో.!

Jio: ఈ రెండు సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ లను జూలై 3 నుంచి తీసేస్తున్న జియో.!
HIGHLIGHTS

జూలై నెలలో టెలికాం రంగంలో పెను మార్పులు జరగనున్నాయి

ARPU ను పెంచే దిశగా టెలికాం కంపెనీలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టాయి

రిలయన్స్ జియో రెండు సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ లను జూలై 3 నుంచి తీసి వేయడానికి సిద్ధం అయ్యింది

Jio: జూలై నెలలో టెలికాం రంగంలో పెను మార్పులు జరగనున్నాయి మరియు దీనికి జియో కాదు అనర్హం. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) ను పెంచే దిశగా టెలికాం కంపెనీలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా టారిఫ్ లను పెంచేస్తున్నాయి. ఈ చర్యల్లో భాగంగా అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రెండు సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ లను జూలై 3 నుంచి తీసి వేయడానికి సిద్ధం అయ్యింది.

ఏమిటా రెండు Jio సూపర్ ప్లాన్స్?

రిలయన్స్ జియో యూజర్లకు అతి తక్కువ ధరలో అన్లిమిటెడ్ 5జి సర్వీస్ లను అందిస్తున్న రూ. 1559 మరియు రూ. 395 రూపాయల ప్లాన్స్ ను పూర్తిగా నిలిపివేస్తోంది. ఈ రెండు ప్లాన్స్ కూడా అతి తక్కువ ఖర్చులో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ 5జి సర్వీసులను అందిస్తున్నాయి. ఇప్పుడు కొత్త సమీకరణల కోసం ఇటివంటి ప్లాన్ లు అడ్డుగోడగా నిలుస్తాయి. అందుకే, ఈ రెండు ప్లాన్ లను జూలై 3 వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తుంది.

Jio
Jio

అయితే, అప్పటి వరకు ఈ ప్లాన్ లను రీఛార్జ్ చేసుకునే అవకాశం జియో యూజర్లకు అందించింది. ఈ రెండు ప్లాన్ లలో రూ. 1559 రూపాయల ప్లాన్ 336 రోజులు అన్లిమిటెడ్ 5జి లాభాలు మరియు అన్లిమిటెడ్ కాలింగ్ లాభాలను అందిస్తే, రూ. 396 రూపాయల ప్లాన్ 84 రోజులు ఈ లాభాలను అందిస్తుంది. ఇప్పుడు రెండు ఈ ప్లాన్ లు కూడా జూలై నెల నుంచి కనుమరుగై పోతాయి. ఒకవేళ ఈ ప్లాన్ లను జూలై 3 లోపుగా రీచార్జ్ చేసుకుంటే మాత్రం, ప్రస్తుతం నడుస్తున్న ప్లాన్ వ్యాలిడిటీ ముగియగానే ఈ ప్లాన్ ఆటోమాటిగ్గా చెల్లుబాటు లోకి వస్తుంది.

Also Read: TWS Buds: ఈరోజు రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ పై ఒక లుక్కేయండి.!

ఇది ఇలా ఉంటే, బేస్ ప్లాన్ టారిఫ్ రేట్లు కూడా భారీగా జియో పెంచుతోంది. ప్రస్తుతం రూ. 155 రూపాయలు ఉన్న బేస్ ప్లాన్ ను 22% పెంచి రూ. 189 రూపాయలు చేస్తుందని చెబుతున్నారు. జూలై నుంచి రీఛార్జ్ చేయాలంటే కస్టమర్ లకు ఇక మోత మోగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo