Jio Bharat Phone vs Jio Phone Plans: ఈ రెండు ఫోన్ల రీఛార్జ్ ప్లాన్స్ మధ్య ఉన్న తేడా గురించి తెలుసా? రెండు ఒకటే కదా ఏమిటి తేడా అనుకున్నారో మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, రిలయన్స్ జియో ముందు నుండే అఫర్ చేస్తున్న Jio Phone ల కోసం చాలా ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. అయితే, రీసెంట్ గా విడుదల చేసిన Jio Bharat Phone యూజర్ల కోసం కేవలం రెండు ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉంచింది. Jio Bharat Phone vs Jio Phone Plans రెండు ఫోన్ల రీఛార్జ్ ప్లాన్స్ మధ్య ఉన్న తేడా గురించి ఈరోజు తెలుసుకోండి.
జియో భారత్ ఫోన్ యూజర్ల కోసం రూ. 123 మరియు రూ. 1,234 ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించింది. ఇందులో, రూ. 123 ప్రీపెయిడ్ ప్లాన్ నెల రోజుల వ్యాలిడిటీ తో వస్తే, రూ. 1,234 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రెండు ప్లాన్స్ కూడా పూర్తి వ్యాలిడిటీ కాలానికి గనుఁ అన్లిమిటెడ్ క్లెయింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి.
ఈ రెండు Jio Bharat phone Plans తో డేటా కూడా మీకు అందుకుంది. నెల వారి ప్లాన్ తో రోజుకు 0.5 GB చొప్పున 14GB 4G హై స్పీడ్ డేటా మరియు సంవత్సరం ప్లాన్ తో రోజుకు 0.5 GB చొప్పున టోటల్ 168 GB డేటా లభిస్తుంది. నెల వారి ప్లాన్ తో యూజర్లకు 300 SMS లు మరియు 336 డేస్ ప్లాన్ తో నెలకు 300 SMSలిమిట్ చొప్పున 12 నెలలు అందుతాయి.
ఇక జియోఫోన్ కోసం జియో అందించిన ప్లాన్స్ విషయానికి వస్తే, Jio Phone యూజర్ల కోసం మొత్తం 7 ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించింది రిలయన్స్ జియో. ఇందులో 23 రోజుల వ్యాలిడిటీ మొదలుకొని 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీ వరకూ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. అవి: రూ. 75, రూ. 91, రూ. 125, రూ. 152,రూ. 186,రూ. 223 మరియు రూ. 895 ప్లాన్స్.
ఈ అన్ని ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అఫర్ చేస్తాయి. ప్లాన్ ను బట్టి రోజు వారి డేటా, SMS మరియు వ్యాలిడిటీలో మాత్రమే తేడాలు ఉంటాయి.
ఈ ప్లాన్ అత్యంత చవకైన Jio phone ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఇది 23 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో 100 MB/Day + 200 MB మరియు 50 SMS లాభాలను కూడా పొందవచ్చు.
ఈ ప్లాన్ బడ్జెట్ నెలవారి ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో 100 MB/day + 200 MB మరియు 50 SMS లిమిట్ అందుతాయి.
ఈ ప్లాన్ రోజు వారి ఎక్కువ డేటా కోరుకునే వారికోసం జియో అందించింది. అయితే, ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే వస్తుంది. కానీ, ఈ ప్లాన్ తో 0.5 GB/day చొప్పున టోటల్ 11.5GB డేటా లభిస్తుంది మరియు 300 SMS ల ప్రయోజనం కూడా అందుతుంది.
ఈ ప్లాన్ Jio Phone యూజర్ల కోసం అందించబడిన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ మరియు ఇది 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో నెలకు 2 GB చొప్పున 12 నెలలు డేటా అందుతుంది. అలాగే, నెలకు 50 SMS చొప్పున 12 నెలల పాటు SMS సౌకర్యం అందుతుంది.