జియో కస్టమర్లకు అన్లిమిటెడ్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. అయితే, అధిక లాభాన్నిచ్చే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి చూస్తున్నట్లయితే ఈ నాలుగు ప్లాన్స్ ను పరిశీలించవచ్చు. జియో యొక్క ఈ 4 ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో కస్టమర్లకు అన్లిమిటెడ్ ప్రయోజనాలను ఇస్తాయి. అంతేకాదు, ఈ ప్లాన్స్ 28 రోజుల వ్యాలిడిటీ మొదలుకొని ఒక సంవత్సరం వ్యాలిడిటీ వరకూ ఉన్నాయి. జియో యొక్క ఈ బెస్ట్ 4 ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దాం.
రిలయన్స్ జియో యొక్క తదుపరి ప్రణాళిక గురించి మాట్లాడితే, ఈ 149 రూపాయల ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జిబి డేటా మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.
రిలయన్స్ జియో కస్టమర్లకు అత్యంత ప్రీతి పాత్రమైన ప్లానుగా ఈ 199 రూపాయల ప్లాన్ నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 1.5 జిబి డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 42GB డేటాతో వస్తుంది మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.
రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ బడ్జెట్ లో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS, మరియు 84 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డైలీ 1.5 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 126 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
రిలయన్స్ జియో యొక్క ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS, మరియు 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 730 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.
మరిన్ని ఇతర రిలయన్స్ జియో ప్లాన్స్ కోసం Click Here