జియో ధమాకా అఫర్: ఈ రీఛార్జ్ తో ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!

Updated on 04-Nov-2022
HIGHLIGHTS

ఈ జియో రీఛార్జ్ చేస్తే ఉచిత OTT సబ్ స్క్రిప్షన్

జియో అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్

అదనపు ప్రయోజనం మిమల్ని మరింత ఆకట్టుకుంటుంది

జియో ధమాకా అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే ఉచిత OTT సబ్ స్క్రిప్షన్. వాస్తవానికి, ముందుగా చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన రిలయన్స్ జియో ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ అందించేది. అయితే, రీసెంట్ గా ఆ ప్లాన్ లలో కొన్నింటిని పూర్తిగా తలగించగా, మరి కొన్నింటిని రివైజ్ చేసింది. అయితే, రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ తో మాత్రం ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ఇప్పటికీ అఫర్ చేస్తోంది. ఈరోజు మనం ఆ రెండు ప్లాన్స్ అందిస్తున్న ప్రయోజనాలను మరియు మరిన్ని వివరాలను చుడనున్నాము.

Jio Rs.1,499 Plan

జియో అఫర్ చేస్తున్న ప్లాన్ లలో ఈ Rs.1,499 రీఛార్జ్ ప్లాన్ ని బెస్ట్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటాని కూడా మీకు అందిస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.

ఇప్పటి వరకు పైన చెప్పిన ప్రయోజనాలన్నిఒక ఎత్తయితే మరొక అదనపు ప్రయోజనం మిమల్ని మరింత ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం మీరు పొందుతారు. అంటే, మీకు 85 రోజుల జియో రీఛార్జ్ ప్రయోజనాలన్నీ కూడా ఉచితంగా అఫర్ చేస్తున్నట్లే. అయితే, Disney+ Hotstar Premium సబ్ స్క్రిప్షన్ ముందు నుండే కలిగి ఉన్న వారికి ఇది నప్పదు.           

Jio Rs.4,199 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :