ప్రస్తుతం మరొకసారి ఇంటికే పరిమితమవ్వాల్సిన అవసరం రానున్నట్లు కనిపిస్తోంది. మరి అన్ని విషయాలను తెలుసుకుంటూ అప్డేటెడ్ గా ఉండడానికి మీకు ఎక్కువ డేటా అవసరమవుతుంది. జియో కస్టమర్ల కోసం రోజువారి ఎక్కువ డేటా లిమిట్ తో పాటుగా గరిష్టంగా 10GB వరకూ ఉచిత డేటా అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ ని కూడా అందించింది. అందుకే, జియో యొక్క ఈ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దాం.
రిలయన్స్ జియో యొక్క ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS, మరియు 365 రోజుల వ్యాలిడిటీని కలిగివుంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీతో పాటుగా, అధనపు 10GB ఉచిత హై స్పీడ్ డేటాని అఫర్ చేస్తుంది. అంటే, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 740 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది.
రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ కొంచెం ఎక్కువ ధరతో వున్నా కూడా అధిక డేటా ప్రయోజనంతో వస్తుంది. రోజు ఎక్కువ డేటాని కోరుకునే వారికీ ఇది సరిగ్గా సరిపోతుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS, మరియు 28 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డైలీ 3GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 90GB డేటాతో పాటుగా 6GB ఉచిత డేటాని కూడా అందిస్తుంది. అంతేకాదు, రూ.399 రూపాయల విలువ గల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది. అలాగే,Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ బడ్జెట్ లో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS, మరియు 84 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 1.5 GB హై స్పీడ్ 4G డేటాతో మరియు 5GB అధనపు ఉచిత డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 131 GB డేటాని మరియు రూ. 399 రూపాయల విలువ గల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది. అలాగే,Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.