Jio Best Plans: జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ఇవేనట.!

జియో తన కస్టమర్ల కోసం చాలా బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది
కొన్ని బడ్జెట్ ప్రైస్ లో ఆకట్టుకునే బెనిఫిట్స్ అందిస్తాయి
ఈరోజు అటువంటి Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు చూడనున్నాము
Jio Best Plans: రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం చాలా బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. వాటిలో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ అధిక లాభాలు అందించేవి కాగా, కొన్ని బడ్జెట్ ప్రైస్ లో ఆకట్టుకునే బెనిఫిట్స్ అందిస్తాయి. మరిన్ని కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పూర్తి ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఈరోజు అటువంటి బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు చూడనున్నాము. ఒక్కమాటలో చెప్పాలంటే జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ఇవేనట. మరి ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూసేద్దామా.
Jio Best Plans: ఏమిటా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్?
జియో యొక్క రూ. 175 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 445 ప్రీపెయిడ్ ప్లాన్ లు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ గా చెప్పబడతాయి. ఎందుకంటే, ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా 10 వరకు OTT యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తాయి. మరి ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.
జియో రూ. 175 ప్లాన్
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జిఓ ఆఫర్ చేస్తున్న డేటా ఓన్లీ ప్యాక్. అంటే, ఈ ప్లాన్ తో కేవలం 10GB డేటా మాత్రమే అందిస్తుంది. అయితే అదనపు బెనిఫిట్స్ లో భాగంగా 10 OTT యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు Sony LIV, ZEE5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, Sun NXT, కంచా లంక, ప్లానెట్ మరాఠి, చౌపల్ మరియు Hoichoi లను JioTV Mobile App ద్వారా చూడటానికి యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు ఇక్కడ తెలిపిన 10 OTT యాప్స్ కు కూడా 28 రోజులు యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Realme Narzo 80 Pro 5G ఫోన్ ను సెగ్మెంట్ ఫాస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.!
జియో రూ. 445 ప్లాన్
ఇది జియో ఆఫర్ చేస్తున్న నెల రోజుల (28 డేస్) అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో కూడా 10 OTT యాక్సెస్ బెనిఫిట్ తో పాటు మరో రెండు యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, 5G అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100SMS బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఇది కాకుండా 4G నెట్వర్క్ పై డైలీ 2GB డేటా కూడా అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, Sony LIV, ZEE5, Sun NXT, కంచా లంక, ప్లానెట్ మరాఠి, చౌపల్, Hoichoi, జియో టీవీ, ఫ్యాన్ కోడ్ మరియు జియో AI క్లౌడ్ యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ చెల్లుబాటు కాలానికి ఈ ఉచిత OTT యాక్సెస్ ను ఆఫర్ చేస్తుంది.