Jio Best Plan: రిలయన్స్ జియో యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నాము. గతంలో అందించిన ప్రీపెయిడ్ ప్లాన్ లతో పోలిస్తే, ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ చేయడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, పెరిగిన రేట్లలో కూడా అన్ని లాభాలు అందించే కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను రిలయన్స్ జియో ఆఫర్ చేస్తోంది. వాటిలో ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన కొత్త రూ. 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో బ్స్ ప్లాన్ గా నిలుస్తుంది. ఇప్పుడు మనం చూడనున్నది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే. ఎందుకంటే, ఈ జియో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. మరి ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.
Also Read: End Of Season సేల్ నుంచి LG ట్రిపుల్ అప్ ఫైరింగ్ Soundbar పై ధమాకా ఆఫర్.!
జియో యొక్క రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్ చేస్తుంది. అంటే, జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది. అంతేకాదు, 4జి నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా మరియు 90 లకు గాను 20GB అదనపు డేటాని కూడా అందిస్తుంది.
ఈ జియో మూడు నెలల ప్రీపెయిడ్ ప్లాన్ తో 90 రోజుల పాటు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా లభిస్తుంది. అంతేకాదు, జియో యొక్క జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమౌంట్ ను మూడు నెలకు లెక్కిస్తే కేవలం రూ. 300 రూపాయలు మాత్రమే అవుతుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here