Jio Best Plan: రిలయన్స్ జియో యూజర్లకు అధిక లాభాలను అందించే కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేయడం ద్వారా 90 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలను అందుకోవచ్చు. 2024 IPL సీజన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ పైనన్ అందించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.
2024 IPL సీజన్ సందర్భంగా రిలయన్స్ జియో ఇటీవల సరికొత్తగా తీసుకొచ్చిన, రూ. 749 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు చర్చించబోతోంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను డేటా, కాలింగ్, SMS మరియు లాంగ్ వ్యాలిడిటీ వంటి అన్ని ప్రయోజనాలతో జియో అందించింది.
రిలయన్స్ జియో యొక్క ఈ Rs. 749 ప్రీపెయిడ్ ప్లాన్ ను క్రికెట్ ఆఫర్ లో భాగంగా తీసుకు వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో 90 రోజుల పాటు ఆన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు పొందుతారు.
ఈ ప్లాన్ తో 5G నెట్ వర్క్ పైన unlimited 5G డేటా లేదా 4G నెట్ వర్క్ పైన రోజు 2GB డేటా చొప్పున 180 GB డేటాని ప్యూతి వ్యాలిడిటీ కాలానికి అందుకుంటారు. అంతేకాదు, ఈ ప్లాన్ తో 20 GB అదనపు డేటాని కూడా జియో అందిస్తోంది. అంనంటే, ఈ ప్లాన్ తో 90 రోజులకు గాను పూర్తిగా 200 GB 4G డేటాని అందుకుంటారు.
Also Read: Ambrane PowerHub 300: ఫ్రిడ్జ్ కు సైతం 6 గంటలు పవర్ ఇవ్వగల పవర్ హబ్ లాంఛ్.!
ఇక ఈ ప్లాన్ అందించే మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రోజు 100 SMS ఉపయోగ ప్రయోజనం కూడా అంధిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో JioTV, JioCinema మరియు JioCloud లకు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
ఈ జియో బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, నెలకు ఖర్చుతోనే రూ. 250 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలను అందుకోవచ్చు.