Jio యూజర్లకు అధిక లాభాలను అందించే టాప్ 3 ప్లాన్స్ గురించి ఈరోజు చుడనున్నాము. ఎందుకంటే, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి రీఛార్జ్ చేసి సంఅన్లిమిటెడ్ లాభాల వత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలను అందుకోటానికే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అందుకే, జియో యూజర్లకు రిలయన్స్ జియో సంవత్సరం లాభాలను అందించే ప్లాన్ రిలయన్స్ జియో ప్రసుతం టెలికం
పూర్తిగా సంవత్సరం (365 రోజులు) అన్లిమిటెడ్ లాభాలను మరియు OTT యాప్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ లను కూడా బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ లు అందిస్తున్నాయి. ఇందులో, రూ. 3,178, రూ. 3,227 మరియు రూ. 3,662 వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా చెప్పబడతాయి.
రూ. 3,178 జియో వన్ ఇయర్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ 365 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా (5G మాత్రమే) మరియు డైలీ 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మీరు 4G నెట్ వర్క్ పరిధిలో ఉంటే డైలీ 2GB డేటా మీకు ఈ ప్లాన్ తో అందుతుంది. అంతేకాదు, ఈ జియో బెస్ట్ ప్లాన్ తో 1-year Prime Video Mobile Edition సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా మీకు అందుతుంది.
Also Read : JioPhone Prima: ఈరోజు నుండి మొదలైన జియో New ఫీచర్ ఫోన్ సేల్.!
ఇక జియో యొక్క రూ. 3,227 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ జియో ప్లాన్ తో 365 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్, 5G అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందుతాయి. కానీ, మీరు 4G నెట్ వర్క్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాత్రం మీకు రోజుకు 2GB డేటా చొప్పున సంవత్సరం మొత్తం అందుతుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 1 year Disney+Hotstar Mobile షబ్ స్క్రిప్షన్ ను ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు. .
జియో రూ. 3,662 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 365 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్, 5G అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోనాలు మీకు లభిస్తాయి. కానీ, మీరు 4G నెట్ వర్క్ పైన ఉన్నపుడు మాత్రం రోజుకు 2.5GB డేటా మాత్రమే అందుతుంది. అయితే, ఈ ప్లాన్ తో రెండు ప్రముఖ OTT యాప్స్ కి యాక్సెస్ అందుతుంది. అదేనండి, ఈ ప్లాన్ తో JioTV app ద్వారా Sony LIV మరియు ZEE5 లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా లభిస్తుంది.
పైన తెలిపిన మూడు వన్ ఇయర్ ప్లాన్స్ పైన Jio Cinema, Jio TV మరియు Jio Cloud యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.