ప్రస్తుతం, టెలికం రంగంలో నడుస్తున్న ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి, తమ టారిఫ్ ధరలను పెంచనున్నట్లు ప్రధాన టెలికం సంస్థలైనటువంటి, భారతి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా ప్రకటించిన విష్యం తెలిసందే. అయితే, ఇప్పుడు జియో కొత్తగా చేసిన ప్రకనటన ద్వారా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సుంకాల ధరలను పెంచనున్న ఇతర టెలికాం సంస్థలతో పాటుగా తాము కూడా నడవనున్నామని తెలిపింది.
మీడియా నివేదికల ప్రకారం, టెలికం టారిఫ్ ల కోసం TRAI అన్ని టెలికం సంస్థలతో కలిసి సంప్రదింపులు చేస్తోంది. కాబట్టి, ఇతర ఆపరేటర్ల మాదిరిగానే మేము కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము మరియు భారతీయ వినియోగదారులకు ప్రయోజమా చేకూర్చేలా ఇండస్ట్రీని బలోపేతం చేసేలా టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరియు రానున్న కొన్ని వారాల్లో డేటా మరియు ఇతర ప్రయోజనాలకు ప్రతికూలతను చూపని విధంగా టారిఫ్ లను పెంచనున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వాస్తవానికి, ముందుగా వచ్చిన నివేధిక ప్రకారం, ప్రధాన టెలికం సంస్థలు రూ.80,000 కోట్ల రుపాయల పైగా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నట్లు సుప్రీం కోర్టు తెలిపిన విషయం తెలిసిందే. ఈ బకాయిలను చెల్లించడానికి మరియు ఆర్ధిక ఇబ్బదుల నుండి గట్టెక్కడానికి ఈ టెలికం సంస్థలు కొత్త రెవిన్యుని జనరేట్ చెయ్యలేవు కాబట్టి, టారిఫ్ ను పెంచడం ద్వారా రెవిన్యూను వృద్ధి చెయ్యవచ్చు. కాబట్టి, ఈ టెలికం సంస్థలు ఈ విధంగా చేయడానికి పూనుకోనున్నాయి. అంటే, జియో ఇప్పుడు చేసిన ప్రకటన చేసిన ప్రకారం ఇదే బాటలో తన టారిఫ్ లను పెంచనుంది.