JioLINK కొత్త ప్లాన్స్ రూ.6,99 నుండి ప్రారంభం : అధిక డేటాతో ప్రకటించింది
రిలయన్స్ జియో తన JIOLINK కోసం కొన్ని కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది.
రిలయన్స్ జియో తన JIOLINK కోసం కొన్ని కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. వీటితో, ఈ లాక్ డౌన్ సమయంలో మీకు అవసరమైన ఎక్కువ డేటాని అందించే విధంగా ప్రకటించింది. ఈ ప్లాన్ను, రూ. 699 రూపాయల ప్రారంభ ధరతో తీసుకొచ్చింది మరియు ఇందులో 1076GB డేటాతో పాటు, మీకు 196 రోజుల వ్యాలిడిటీ కూడా లభిస్తుంది.
JioLink 4G అనేది LTE మోడెమ్ అని మనకు తెలుసు. ఇది కొన్ని ప్రాంతాలలో కవరేజీని మెరుగుపరుస్తుంది. రిలయన్స్ జియో 4 జి సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు, జియోలింక్ అందించిన జియో ఫై హాట్‌స్పాట్ పరికరానికి ఇది భిన్నంగా ఉంటుంది.
ఇప్పుడు జియో యొక్క 4 జి సేవలు అందుబాటులో ఉన్నాయి, జియోలింక్ మోడెమ్ ఎక్కువగా అవసరం లేకుండా పోయింది. అయితే, మీకు అలాంటి మాధ్యమం ఉంటే, మీరు దానిని అవసరమైన రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, జియో ఇకపై జియోలింక్ మోడెమ్ లను అందించడం లేదని మరియు భవిష్యత్తులో కూడా అందిచదని గమనించండి. కాబట్టి, మీకు ఇప్పటికే మోడెమ్ ఉంటే, మీరు రీఛార్జ్ యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.
జియోలింక్‌లో రూ .699 నుంచి మూడు ప్లాన్‌లు ఉన్నాయి. రూ .600 ఒక నెలకు చెల్లుతుంది, ఇక రెండవది మూడు నెలలకు రూ .2,099 ప్లాన్ , ఇక ఆరు నెలల కోసం ఈ ప్లాన్ రూ .4,199. 699 రూపాయలధరలో వస్తుంది. మోహ్దాటి ప్లాన్ లో , మీరు రోజుకు 5GB డేటాను 28 రోజుల వరకూ పొందుతారు, అంటే మీకు మొత్తం 156GB డేటా ఆఫర్ చేయబడింది. రోజువారీ డేటా పైన, రిలయన్స్ జియో కూడా 16GB అదనపు డేటాను అందిస్తోంది, తద్వారా మొత్తం డేటా మైలేజ్ 156GB వరకు చేరుతుంది. యూజర్లు జియో యాప్ ల సౌకర్యాన్ని పొందుతారు కాని వాయిస్ మరియు ఎస్‌ఎంఎస్‌లు వంటి ప్రయోజనం ఉంత్రం ఉండదు.
రూ .2,099 జియోలింక్ ప్లాన్ రోజుకు 5 జిబి డేటాను అదనంగా 48 జిబి డేటాతో పొందుతోంది. ఈ మొత్తం డేటా ప్రయోజనాన్ని లెక్కించి చూస్తే మొత్తంగా 538 GB ల డేటాని అందుకుంటారు. ఈ ప్లాన్ 98 రోజులు (మూడు నెలలు) చెల్లుతుంది. ఇక చివరిగా రూ .4,199 యొక్క జియోలింక్ ప్లాన్ విషయానికి వస్తే, వినియోగదారుడు మొత్తం 1076GB డేటాను (రోజుకు 5GB 96GB అదనపు డేటాతో) 196 రోజులు (ఆరు నెలలు) వినియోగించటానికి అనుమతిస్తుంది. రూ .2,099 మరియు 4,199 రూపాయల రెండు ప్లాన్ లలో కూడా మీరు జియో యాప్ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా పొందుతారు.