JIO కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు విడుదల : రేపటి నుండి అమలుకానున్న కొత్త ధరలు ఇవే

JIO కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు విడుదల : రేపటి నుండి అమలుకానున్న కొత్త ధరలు ఇవే
HIGHLIGHTS

ఈ కొత్త ప్లాన్స్ అన్ని కూడా రేపటి నుండి అమలులోకి వస్తాయి.

డిసెంబర్ 3 వ తేదీ నుండి  ప్రధాన టెలికం సంస్థలైనటువంటి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా తమ కొత్త ప్లాన్స్ అమలులోకి తీసుకురాగా, రేపటి నుండి జియో తన కొత్త ప్రీపెయిడ్ ధరలను అమలులోకి తీసుకురానుంది. దీనికి సంభందించి రేపటి నుండి అమలు చెయ్యనున్న కొత్త ధరల వివరాలను విడుదల చేసింది. అయితే,  వినియోగదారులకు తగిన ప్రయోజనాలతో తమ కొత్త ఆల్-ఇన్-వన్ (AIO) ప్రీపెయిడ్ ప్లాన్స్ విడుదల చేస్తామని ముందుగా తెలియచేసినట్లుగానే, ప్రస్తుత టెలికం ప్రీపెయిడ్ ప్లాన్లతో పోలిస్తే, తక్కువ ధరకే ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ అన్ని కూడా రేపటి నుండి అమలులోకి వస్తాయి.  

ఈ జియో యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాల్లోకి వెళితే, జియో 1 నెల (28రోజులు) వ్యాలిడిటీ మొదలుకొని 1సంవత్సరం వరకూ వ్యాలిడిటీ గల అనేకమైన ప్లాన్స్ అందించింది. అలాగే, కేవలం కాలింగ్ ప్రధానాంశంగా చేసుకొని చాలా సరసమైన ధరలో మూడు ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా అందించింది. ఈ సరసమైన ప్లాన్స్ రూ. 128 నుండి ప్రారంభమవుతుంది.

JIO NEW PLANS : వ్యాలిడిటీ ప్రకారంగా

1 నెల ప్లాన్ (28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్)

ఈ విభాగంలో మూడు ఆల్-ఇన్-వన్ ప్లాన్స్ అందించింది. ఈ మూడు ప్లాన్స్ యొక్క వ్యాలిడిటీ, జియో నుండి జియో నెట్వర్క్ కి అన్లిమిటెడ్ మరియు 1000 నిముషాల ఇతర నెట్వర్క్ కాలింగ్ నిముషాలు వాటి ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఈ మూడు ప్లాన్ల యొక్క రోజు వారి డేటా పరిధి మాత్రమే మారుతుంది.        

1. రూ. 199  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ            

2. రూ. 249  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ            

3. రూ. 349  (AIO ప్లాన్) 3 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ            

2 నెలల ప్లాన్ (56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్)

ఈ విభాగంలో రెండు ఆల్-ఇన్-వన్ ప్లాన్స్ అందించింది. ఈ రెండు ప్లాన్స్ యొక్క వ్యాలిడిటీ, జియో నుండి జియో నెట్వర్క్ కి అన్లిమిటెడ్ మరియు 2000 నిముషాల ఇతర నెట్వర్క్ కాలింగ్ నిముషాలు వాటి ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఈ రెండు ప్లాన్ల యొక్క రోజు వారి డేటా పరిధి మాత్రమే మారుతుంది.        

1. రూ. 399  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ            

2. రూ. 444  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ            

గమనిక: ఈ 2000 ఆఫ్ నెట్ మినిట్స్ ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అందించింది.

3 నెలల ప్లాన్ (84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్)

ఈ విభాగంలో రెండు ఆల్-ఇన్-వన్ ప్లాన్స్ అందించింది. ఈ రెండు ప్లాన్స్ యొక్క వ్యాలిడిటీ, జియో నుండి జియో నెట్వర్క్ కి అన్లిమిటెడ్ మరియు 3000 నిముషాల ఇతర నెట్వర్క్ కాలింగ్ నిముషాలు వాటి ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఈ మూడు ప్లాన్ల యొక్క రోజు వారి డేటా పరిధి మాత్రమే మారుతుంది.        

1. రూ. 555  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ            

2. రూ. 299  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ            

ఒక సంవత్సరం ప్లాన్ (365 రోజులు)

1. రూ. 2199 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 12,000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ            

 గమనిక: ఈ 12,000 ఆఫ్ నెట్ మినిట్స్ ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అందించింది.

Jio plans intext.png

ఇక సరసమైన మరియు చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా 3 ప్లాన్స్ అందించింది. అయితే, ప్లాన్స్ డేటా ఎక్కువగా అవసరం లేని మరియు కాలింగ్ ప్రధానంగా అందించింది. వీటిలో మీకు చాలా తక్కువ డేటా దొరుకుతుంది.

1. రూ. 128 (AIO ప్లాన్) 2GB /28 రోజులకి , 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ            

2. రూ. 329 (AIO ప్లాన్) 6GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ            

3. రూ. 1299 (AIO ప్లాన్) 24GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ

ఇక పైన తెలిపిన అన్ని ప్లాన్లకు గాను జియో ప్రైమ్ మెంబర్లకు అధనంగా, జియో యాప్స్ కు యాక్సెస్ లభిస్తుంది.               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo