Jio 8th Anniversary Offer: జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన జియో.!

Updated on 05-Sep-2024
HIGHLIGHTS

జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది.

రీఛార్జ్ ప్లాన్ లతో మరిన్ని లాభాలు జియో ఆఫర్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈరోజు నుంచి సెప్టెంబర్ 10వ తేది లోపు రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ప్రయోజనాలు దక్కుతాయి

Jio 8th Anniversary Offer: రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జియో వార్షికోత్సవ ఆఫర్లు ఈరోజు జియో అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా మూడు రీఛార్జ్ ప్లాన్ లతో మరిన్ని లాభాలు జియో ఆఫర్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

Jio 8th Anniversary Offer: ఆఫర్స్

 జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా బెస్ట్ క్వార్టర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అయిన రూ. 899 మరియు రూ. 999
పైన మరియు బెస్ట్ యాన్యువల్ ప్లాన్ అయిన రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్ పైన అదనపు ప్రయోజనాలు ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కూడా జియో తెలిపింది. ఈ ప్లాన్స్ ఆఫర్ చేసే ప్రయోజనాలు మరియు అదనపు ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.

ఏమిటా బెనిఫిట్స్?

ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన కూడా భారీ ప్రయోజనాలు అందించింది. ఈ ప్లాన్ లను ఈరోజు నుంచి సెప్టెంబర్ 10వ తేది లోపు రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ప్రయోజనాలు దక్కుతాయి. అవేమిటంటే, ఈ మూడు ప్లాన్స్ తో రూ. 175 రూపాయల విలువైన 28 రోజుల 10 OTT సబ్ స్క్రిప్షన్ మరియు 10GB ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అలాగే, Ajio లో రూ. 2999 రూపాయలు పైబడి షాపింగ్ చేసే వారికి రూ. 500 తగ్గింపు కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, మూడు నెలల Zomato Gold Membership ను కూడా ఈ ఆఫర్ లో భాగంగా ఉచితంగా అందిస్తుంది.

జియో రూ. 899 ప్రయోజనాలు

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ వ్యాలిడిటీ సమయానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా + 20 GB అదనపు డేటా మరియు డైలీ 100 SMS వినియోగ సౌకర్యంతో వస్తుంది. అంతేకాదు, ఈ పాన్ తో తో జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేట్ ని కూడా పొందవచ్చు.

జియో రూ. 999 ప్రయోజనాలు

జియో యొక్క ఈ రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ తో 98 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, 4జి నెట్ వర్క్ పై డైలీ 2 GB డేటా మరియు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం అందిస్తుంది. ఈ పాన్ తో కూడా జియో ట్రూ 5జి అన్లిమిటెడ్ 5జి డేట్ ప్రయోజనాలు అందిస్తుంది.

Also Read: Infinix Hot 50 5G: 10 వేల ఉప బడ్జెట్ లో స్టన్నింగ్ 5G ఫోన్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్.!

జియో రూ. 3,599 ప్లాన్

జియో రూ. 3,599 ప్లాన్ పూర్తిగా ఒక సంవత్సరం (365 రోజులు) చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2.5 GB 4జి డేటా మరియు డైలీ 100 SMS ఉపయోగం అందుతుంది. ఈ ప్లాన్ తో కూడా జియో 5జి అన్లిమిటెడ్ వినియోగ ప్రయోజనం అందుతుంది.

ఈ మూడు ప్లాన్స్ తో జియో టీవీ, జియో క్లౌడ్ మరియు జియో సినిమా లాక్కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. 

లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ చెక్ చేయడానికి మరియు రీఛార్జ్ చేయడానికి Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :