జియో అఫర్ చేస్తున్న బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ అఫర్.!
రిలయన్స్ జియో గొప్ప లాంగ్ వ్యాలిడిటీ అఫర్ ప్రకటించింది
జియో కస్టమర్లకు అధిక లాభాలను జియో అందిస్తోంది
లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే జియో యూజర్లకు ఈ అఫర్ బెస్ట్ అని చెప్పొచ్చు
రిలయన్స్ జియో తన 6వ యానివర్సరీ సందర్భంగా గొప్ప లాంగ్ వ్యాలిడిటీ అఫర్ ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా జియో కస్టమర్లకు అధిక లాభాలను జియో అందిస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ హై స్పీడ్ డేటాతో పాటుగా 75 GB అధిక డేటా వంటి మరిన్ని ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు. మరి జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ అఫర్ వివరాలు ఏమిటో చూద్దామా.
లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే జియో యూజర్లకు ఈ అఫర్ బెస్ట్ అని చెప్పొచ్చు. అదే జియో యొక్క రూ.2,999 లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ మొత్తాన్ని నెల రోజులకు లెక్కకడితే నెలకు 230 రూపాయలు మాత్రమే అవుతుంది.
Jio Rs.2,999 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 75GB డేటాని కూడా జతచేసింది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. జియో 6వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ప్లాన్ తో 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను కూడా యాడ్ చేసింది.
ఇక మరిన్ని జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ విషయానికి వస్తే, Rs.1,499 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా గొప్ప లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ Rs.1,499 రూపాయల విలువవైన డిస్నీ+ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేస్తుంది. అంటే, ఈ ప్లాన్ దాదాపుగా ఉచితంగా లభించినట్లే అవుతుంది. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను గురించి ఈ క్రింద చూడవచ్చు.
Jio Rs.1,499 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here