Jio 5G: తెలంగాణ ప్రజలకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్..!
తెలంగాణ ప్రజలకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అందించింది
శరవేగంగా తన Jio 5G నెట్ వర్క్ ను విస్తరిస్తున్న రిలయన్స్ జియో
అన్లిమిటెడ్ 5G డేటా ఆనందాన్ని ఈ ప్రాంతాల్లో వున్న యూజర్లు అందుకోవచ్చు
తెలంగాణ ప్రజలకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా శరవేగంగా తన Jio 5G నెట్ వర్క్ ను విస్తరిస్తున్న రిలయన్స్ జియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 850 కి పైగా ప్రాంతాల్లో Jio 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే, మాకేంటి గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? Jio 5G సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో Jio True 5G Welcome అఫర్ ద్వారా 4G రీఛార్జ్ తోనే అన్లిమిటెడ్ 5G డేటా ఆనందాన్ని ఈ ప్రాంతాల్లో వున్న యూజర్లు అందుకోవచ్చు.
Jio True 5G:
ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో Jio 5G ని లాంచ్ చేసిన తరువాత, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మెల్ల మెల్లగా 5G నెట్ వర్క్ ను విస్తరించడం మొదలు పెట్టిన జియో, ఇప్పుడు చాలా వేగంగా తన 5G నెట్ వరకు ను విస్తరించింది. ఇప్పటికే ప్రధాన మరియు ఉప నగరాలతో పాటుగా మండల్ హెడ్ క్వార్ట్రర్ లలో కూడా జియో సేవలు విస్తరించాయి.
జియో 5G సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో 1Gpbs వేగంతో అన్లిమిటెడ్ 5G డేటా ని అందుకునే అవకాశం జియో అందించింది. అంటే, తెలంగాణ రాష్టంలోని 850 ప్రాంతాల్లోని జియో యూజర్స్ జియో వెల్ కమ్ అఫర్ ద్వారా ఈ 5G ఆనందాన్ని పొందవచ్చు.
ఆయితే, ప్రతీ 4G ప్రీపెయిడ్ ప్లాన్ పైన అన్లిమిటెడ్ 5G డేటా ని ఎంజాయ్ చెయ్యలేరు. ఎందుకంటే, రూ. 239 ప్లాన్ నుండి మొదలు కొని అంత కంటే పైన లభించే అన్ని ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్స్ పైన ఈ అన్లిమిటెడ్ 5G డేటా ని అందిస్తోంది.