Jio 5G: 1Gbps కంటే అధిక స్పీడ్ తో సర్వీస్ ప్రారంభం.!!

Jio 5G: 1Gbps కంటే అధిక స్పీడ్ తో సర్వీస్ ప్రారంభం.!!
HIGHLIGHTS

దసరా పండుగ రోజున రిలయన్స్ జియో తన 5G సర్వీస్ లను ప్రారంభించింది

ఈ సర్వీస్ లతో పాటుగా Jio Welcome Offer ను కూడా అందించింది

Jio True 5G సర్వీస్ యూజర్లకు అందుబాటులో ఉంది

దసరా పండుగ రోజున రిలయన్స్ జియో తన 5G సర్వీస్ లను ప్రారంభించింది. దేశరాజధాని ఢిల్లీ మరియు మరి కొన్ని ఇతర నగరాల్లో జియో తన 5G బీటా ట్రయల్‌ను ప్రారంభించింది. అంతేకాదు, ఈ సర్వీస్ లతో పాటుగా Jio Welcome Offer ను కూడా అందించింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు వారి Jio SIM లేదా 5G హ్యాండ్‌ సెట్‌ ను అప్‌గ్రేడ్ చేయాల్సిన పనిలేకుండానే 5జి సర్వీసులను పొందవచ్చు. ఎందుకంటే, Jio True 5G సర్వీస్ అందుబాటులోకి రాగానే ఇది ఆటొమ్యాటిక్ గా అప్‌గ్రేడ్ అవుతుంది.

అయితే, జియో 5G సర్వీస్ లను అందురు కస్టమర్లు కూడా నేరుగా అందుకోలేరు. జియో 5G సర్వీస్ ను పొందడం గురించి జియో తన ప్రకటనలో వెల్లడించింది. దాని ప్రకారం, జియో 5G సర్వీస్ ప్రస్తుతానికి కేవలం ఇన్విటేషన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే, ప్రస్తుతం ఇన్విటేషన్ అందుకున్న జియో యూజర్లు ఈ 5G సేవలను ఉపయోగించుకోగలుగుతారు. కానీ, తర్వాత కాలంలో నగరంలోని వినియోగదారులందరికీ దశల వారీగా Jio 5G సేవలు అందుతాయి. Jio True 5G ఆఫర్ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు వారణాసి పట్టణాల్లోని యూజర్లకు అందుబాటులో ఉంది.

Jio Welcome Offer

ప్రస్తుతం, 1Gbps కంటే అధిక స్పీడ్ తో Jio 5G సర్వీస్ అందించబడుతోంది. Jio True 5G సర్వీస్ అన్ని హ్యాండ్‌సెట్‌లకు అనుకూలంగా ఉన్నట్లు కూడా జియో చెబుతోంది. అంతేకాదు, ఈ True 5G సర్వీస్ తో సజావుగా పనిచేసే హ్యాండ్‌సెట్‌ లను విస్తృతంగా ఉంచేలా చూసేందుకు Jio అన్ని హ్యాండ్‌సెట్ బ్రాండ్‌ లతో చురుకుగా పాల్గొంటోంది.

Jio Welcome Offer ద్వారా వినియోగదారులు తమ ప్రస్తుత 4G SIM లేదా 5G హ్యాండ్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆటొమ్యాటిగ్గా Jio True 5G సేవలకు అప్‌గ్రేడ్ చేయబడతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo