Jio 5G: లాంచ్ తేదీ మరియు ప్లాన్ రేట్లు తెలుసుకోండి.!
రిలియన్స్ ఆగష్టు 15న భారతదేశంలో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్లు కనిపిస్తోంది
ట్రయల్ సర్వీస్ కోసం ముందుగా పెద్ద నగరాల్లో ప్రారంభించబడుతుంది
Jio ప్రస్తుతం 9 ప్రధాన నగరాల్లో తన 5G సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం
రిలయన్స్ జియో దాదాపు రూ.88,078 కోట్లతో వివిధ బ్యాండ్ లలో 24,740MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ప్రీమియం క్వాలిటీ 700MHz బ్యాండ్‌ని కొనుగోలు చేసిన ఏకైక టెలికాం కంపెనీగా రిలయన్స్ టెలికాం నిలిచింది. ఇప్పుడు రిలియన్స్ ఆగష్టు 15న భారతదేశంలో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్లు కనిపిస్తోంది. అయితే, జియో నేరుగా తన 5G నెట్వర్క్ సర్వీసులను ప్రారంభించక పోవచ్చు. ఎందుకంటే, ఇప్పటి వరకూ ఈ విషయాన్ని గురించి కంపెనీ ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ సూచన ప్రాయంగా తెలిపిన మాటల ద్వారా ఇలా జరగవచ్చని ఊహిస్తున్నారు.
ఇండియాలో 5జీ సర్వీస్ లను ప్రారంభించడం ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటాము, అని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. ఈ మాటలను బట్టి జియో తన 5G సర్వీస్ లను ఆగష్టు 15న ప్రకటించని అంచనా వేస్తున్నారు. ఒకవేళ Jio 5G ఆగష్టు 15 న లాంచ్ చేయబడితే, ఇది ప్రధానంగా ట్రయల్ సర్వీస్ కోసం ముందుగా పెద్ద నగరాల్లో ప్రారంభించబడుతుంది. వాస్తవానికి, ఈ ఏడాది చివరి నాటికి అసలు సర్వీస్‌ను ప్రారంభించనున్నారు.
Jio 5G ముందుగా ఏ నగరాల్లో ప్రారంభిస్తుంది?
Jio ప్రస్తుతం 9 ప్రధాన నగరాల్లో తన 5G సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. అందులో, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, జామ్‌నగర్ ఉన్నాయి వంటి పెద్ద నగరాలు ఉన్నాయి. ఇది కాకుండా, గురుగ్రామ్, నోయిడా మొదలైన వాటితో సహా మరో 1000 ప్రధాన ప్రాంతాల్లో 5G ని తీసుకురావడానికి జియో యోచిస్తోంది.
5G సర్వీస్ ప్లాన్‌ల ధర ఎలా ఉంటుంది?
జియో యొక్క 5G ప్లాన్‌ల ధర ఎంత అనేది ఇంకా తెలియదు. అయితే, ధరలు పెరిగినప్పటికీ, Jio 4G ప్రీమియం ప్లాన్స్ ధరలను కూడా ఇప్పటికీ రూ.400-500 లోపే ఉంచింది. కాబట్టి, 5G సర్వీస్ యొక్క ఆకర్షణీయమైన ప్లాన్ ధర 500 కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.