రిలయన్స్ జీయో గత సంవత్సరంలో తన VoWiFi (వాయిస్ ఓవర్ Wi-Fi) సర్వీస్ కోసం రెండుసార్లు పరీక్షలు నిర్వహించింది, మరియు 2018, జులై తరువాత దేశంలో ఈ పరీక్ష నిర్వహించిన మూడవ అతిపెద్ద తేలికో సంస్థగా అవతరించింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి అనేక సర్కిళ్లలో జియో ఈ ఫిచరును పరీక్షించింది. ముందుగా, VoWiFi పైన జియో పరీక్ష తరువాత, ఇది 2019 మొదటి త్రైమాసికంలో ఆరంభమవుతుందిని చాలానే అంచనాలు వేశారు.
అసలు ఏంటి ఈ VoWiFi ?
VoWiFi లేదా వాయిస్ ఓవర్ Wi-Fi, సెల్యులార్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో దీనిని ఉపయోగించి వైర్లెస్ నెట్వర్కులకు కాల్స్ చేసుకునే అవకాశాన్నివినియోగదారులు ఈ VoWiFi ద్వారా అందుకుంటారు. దేశవ్యాప్తంగా ఉచిత పబ్లిక్ Wi-Fi హాట్ స్పాట్లను వ్యవస్థాపించడానికి ప్రభుత్వ పథకం ద్వారా ఈ ఫీచర్ సాయపడుతుంది. ఇది ప్రారంభమయితే, సరైన సెల్యులార్ కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మరింత నెట్వర్కు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, జీయో 4G ఫీచర్ ఫోన్ వినియోగదారుల మధ్య మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఇది జియోకి చాల చక్కని అవకాశంగా ఉంటుంది.
DoT నియమాల ప్రకారం భద్రతా పరీక్షను జియో ఇప్పటికే పూర్తి చేసిందని అంతకుముందు వచ్చిన నివేదిక వెల్లడించింది. ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ కూడా ఆ వేదికను అధిగమించాయి మరియు తమ నెట్వర్కులలో కూడా ఈ VoWiFi ని తీసుకురానున్నాయి.
భారత టెలిఫోన్లకు అనుమతించే లైసెన్స్ అవసరాలకు DoT కి అప్డేట్ చేసిన తరువాత ఈ చర్య తీసుకుంటుంది. ముసాయిదా ప్రకారం, VoWiFi సహాయంతో, ప్రభుత్వం యొక్క బహిరంగ Wi-Fi ప్రాజెక్ట్ మెరుగ్గా చేయబడుతుంది. అయితే, ముందుగా వచ్చిన నివేదికల ప్రకారం జియో దీన్ని త్వరలోనే తీసుకురానున్నదని తెలుస్తోంది.