BSNL కూడా తన టారిఫ్ ధరలను పెంచనుందా ?
డిసెంబర్ నుండి ధరలను పెంచబోతున్నట్లు ధృవీకరించారు.
భారతదేశంలోని అగ్ర టెలికాం ఆపరేటర్లు అయినటువంటి, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటివి రానున్న కొన్ని వారాల్లో టారిఫ్ ధరలను పెంచనున్నట్లు, ఇటీవల ప్రకటించారు. అంటే, వాటి ధరలు పెరుగుతాయని ధృవీకరించబడినప్పటికీ, ఇది వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే, ఇప్పుడు కొత్తగా BSNL కూడా తన టారిఫ్ ధరలను డిసెంబర్ నుండి పెంచాలని యోచిస్తున్నట్లు ET నివేదించింది. పేరు తెలుపని ఒక సీనియర్ బిఎస్ఎన్ఎల్ అధికారి 2019 డిసెంబర్ నుండి ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ దాని ధరలను పెంచబోతున్నట్లు ధృవీకరించారు. ఈ ధరల పెరుగుదల జరిగినప్పుడు, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఈ కొత్త అప్డేట్ గురించి తెలియజేయబడుతుందని, ఈ నివేదిక పేర్కొంది.
"మేము ప్రస్తుతం మా వాయిస్ మరియు డేటా సుంకాన్ని పరిశీలిస్తున్నాము మరియు దానిని డిసెంబర్ 1, 2019 నుండి పెంచుతాము" అని బిఎస్ఎన్ఎల్ అధికారి ET కి చెప్పారు. బిఎస్ఎన్ఎల్ తన టారిఫ్ ప్రణాళికలను పెంచాలని యోచిస్తున్నప్పటికీ, ఈ సంస్థ ప్రస్తుతం డబ్బును కోల్పోతున్నందున మరియు దాని ఆదాయాన్ని పెంచడానికి నిరంతరం కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నందున ఈ వార్తలు నిజమే అయ్యిండవచ్చని. ఏదేమైనా, ఈ టెలికో తన టారిఫ్ ధరలను పెంచినట్లయితే, వినియోగదారులకు వాయిస్ కాల్ చేసినప్పుడు ఆరు పైసలను తిరిగి జమ చేయాలన్న దాని ముందస్తు నిర్ణయానికి వ్యతిరేకంగా మారుతుంది. ముందుగా, రిలయన్స్ జియో తన వినియోగదారులకు నిమిషానికి ఆరు పైసలు IUC ఛార్జీలుగా వసూలు చేస్తామని ప్రకటించిన వెంటనే, BSNL ఈ విషయాన్ని ప్రకటించింది.
అయితే, బిఎస్ఎన్ఎల్ దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించనందున, ఈ నివేదికను ముందస్తు అంచనాగా తీసుకోవాలని మేము సూచిస్తున్నాము. అదనంగా, బిఎస్ఎన్ఎల్ తన టారిఫ్ ధరలను పెంచడంపై ఆలోచిస్తుండగా, రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ తమ టారిఫ్ లను పెంచనున్నట్లు, ఇప్పటికే ధృవీకరించాయి. దీని గురించి జియో మాట్లాడుతూ, "భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా పరిశ్రమను బలోపేతం చేయడానికి మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము మరియు డేటా వినియోగం లేదా వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేయని విధంగా రాబోయే కొద్ది వారాల్లో టారిఫ్ లను తగిన విధంగా పెంచడం వంటి చర్యలు తీసుకుంటాము. డిజిటల్ స్వీకరణ మరియు పెట్టుబడులను కొనసాగిస్తుంది " అని చెప్పింది.
భారతదేశంలో డేటా ఛార్జీలు ప్రపంచంలోనే చౌకైనవి అని వోడాఫోన్ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. " కస్టమర్లు ప్రపంచ స్థాయి డిజిటల్ అనుభవాలను అనుభవిస్తూనే ఎప్పటికి కొనసాగేలా నిర్ధారించడానికి, వోడాఫోన్ ఐడియా దాని టారిఫ్ ధరలను 1 డిసెంబర్ 2019 నుండి పెంచుతుంది" అని వోడాఫోన్ యొక్క ప్రకటన చెబుతుంది. అదేవిధంగా, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనసాగించడానికి టెలికాం రంగంలో పునరావృతమయ్యే ఇంటెన్సివ్ పెట్టుబడులను కూడా ఎయిర్‌టెల్ పేర్కొంది. "కాబట్టి, డిజిటల్ ఇండియా దృష్టికి మద్దతు ఇవ్వడానికి పరిశ్రమ ఆచరణీయంగా ఉండటం చాలా ముఖ్యం. దీని ప్రకారం, డిసెంబరు నుండి ప్రారంభమయ్యే నెలలో ఎయిర్‌టెల్ తగిన విధంగా ధరలను పెంచుతుంది ”అని ఎయిర్‌టెల్ యొక్క ప్రకటనలో పేర్కొంది.