ఇక మనం మనం ఒకటి అంటున్న ఐడియా వోడాఫోన్
అతి పెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించేందుకు ఐడియా ,వొడాఫోన్ సన్నాహాలు
టెలికాం దిగ్గజాలైన ఐడియా మరియు వోడాఫోన్ లు అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాయి . ఈ రెండు కలిసి అతిపెద్ద తిరుగులేని సంస్థ గా ఎదిగేటందుకు ఈ పెద్ద డీల్ ను కుదుర్చుకుంటున్నట్లు సమాచారం . ఈ ఒప్పందం యొక్క ఖరారు ఈ నెలలోపే తెలియనుంది. ఈ డీల్ ముఖ్య కారణం 38 కోట్ల మంది కస్టమర్లతో అతిపెద్ద టెల్కోగా నిలుస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే, ఆదాయం రూ.77,500 – 80,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. ఇక స్పెక్ట్రమ్, మౌలిక వసతులపై ఇరు సంస్థలు వేర్వేరుగా ఎక్కువగా మనీ స్పెండ్ చేయవలసిన పని కూడా తప్పుతుంది.ఈ విలీనం గూర్చి న న్యూస్ ని ఈ రెండుకంపెనీలు ఇంకా తెలియపరచాలనుకోవట్లేదు .