ఐడియా సరికొత్త రూ.392 ప్లాన్ తీసుకొచ్చింది మరియు రూ. 399 ప్రీపెయిడ్ ప్రణాలికను సవరించింది

Updated on 26-Dec-2018
HIGHLIGHTS

ఈ కొత్త రూ. 392 ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 1.4GB డేటాను పూర్తి 60 రోజులకు ఇస్తుంది.

సెల్యులార్ తన పాత 399 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జిని సవరించింది. అదనంగా, ఈ తేలికో ఇప్పుడు రూ. 392 ధరతో సరికొత్త ప్రీపెయిడ్ ప్రణాళికను తీసుకువచ్చింది 60 రోజులు చెల్లుబాటుతో. ఐడియా యొక్క ఈ కొత్త రూ. 392 ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 1.4GB డేటాను పూర్తి 60 రోజులకు ఇస్తుంది. అంతేకాకుండా, అపరిమిత కాలింగ్ మరియు  రోజుకు 100 ఎస్ఎంఎస్ పరిమితితో వస్తుంది. మొత్తం వ్యాలిడిటీకి గాను  84GB డేటాని  2G / 3G / 4G నెట్వర్కుల ద్వారా ఉపయోగించవచ్చు.

84 రోజుల దీర్ఘకాలికానికి  గాను ఐడియా సెల్యులార్ ప్రస్తుతం వినియోగధారులకి రోజువారి 1.4 GB డాటాతో 70 రోజుల చెల్లుబాటుతో అందిస్తున్నరూ. 399 రీఛార్జీని సవరించింది. అదనంగా, ఐడియా సెల్యూలార్ ఈ ప్రణాళికలో చెప్పుకోతగ్గ మార్పులే చేసింది. రోజువారీ 1.4 GB డేటాకి బదులుగా ఇప్పుడు కేవలం 1GB డేటాని మాత్రమే అందిస్తుంది.  అంటే, రోజుకు 400 MB డేటాని తక్కువగా ఇస్తుంది. అయితే, 70 రోజులుగా వున్న దీని చెల్లుబాటు కాలాన్ని మాత్రం 84 రోజులకు పెంచింది. డేటాని తక్కువ వాడుకుని ఎక్కువ రోజుల వ్యాలిడిటిని కోరుకునే వారికీ ఇది చక్కగా సరిపోతుంది.

అయితే,  ఐడియా యొక్క ఈ రెండు ప్రీపెయిడ్ ప్లానులు కూడా కొన్నిFUP పరిమితులు కలిగివుంటాయి. వీటితో,  రోజుకు 250 నిమిషాలు మరియు వారానికి 1000 నిమిషాలు కాల్స్ చేసుకునే వీలు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఈ పరిమితి  దాటితే, ఆపైన చేసేటటువంటి కాల్స్ కి  నిముషానికి 30 పైసలు చెల్లించాల్సివుంటుంది.  అదనంగా, వినియోగదారులు కేవలం 100 ఏకైక నంబర్లకు  మాత్రమే వాయిస్ కాల్స్ చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :