BSNL ప్రకటించిన ఉచిత రెంటల్ ప్లాన్స్ ఇవే

Updated on 31-Jan-2020
HIGHLIGHTS

ఇప్పుడు బ్రాండ్ బ్యాండ్ వినియోగదారుల కోసం ఉచిత రెంటల్ ప్లాన్స్ అఫర్ చేస్తోంది.

ప్రభుత్వ టెలికం సంస్థ అయిన BSNL ఇప్పుడు ఇతర టెలికాం సంస్థలకు పోటీనిచ్చే విధంగా కొత్త ప్లాన్స్ మరియు ఆఫర్లను అందించడంలో నిమగ్నమయినట్లు కనిపిస్తోంది. ముందుగా, గత సంవత్సరం BSNL తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉచిత డేటాని ప్రకటించగా, ఇప్పుడు బ్రాండ్ బ్యాండ్ వినియోగదారుల కోసం ఉచిత రెంటల్ ప్లాన్స్ అఫర్ చేస్తోంది. ఈ ఉచిత రెంటల్ అఫర్ ప్లాన్స్, బ్రాడ్ బ్యాండ్, భారత్ ఫైబర్, ల్యాండ్ లైన్, BBo WiFi బ్రాండ్ బ్యాండ్ ప్లాన్స్ మరియు DSL వంటి అన్ని సర్వీసుల పైన వర్తింప చేసింది.

అయితే, ఈ ఆఫరును కేవలం లాంగ్ టర్మ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి మాత్రమే వర్తింపచేసింది. అంటే, 12 నెలలు అనగా 1 సంవత్సరం రీఛార్జ్ మరియు అంతకంటే ఎక్కువ  వ్యాలిడిటీ కలిగిన ప్లాన్స్ రీఛార్జ్ చేసే వారికీ ఈ ఉచిత రెంటల్ అఫర్ దొరుకుతుంది. ఈ విషయాన్ని ముందుగా టెలికం టాక్ నివేదించింది. దీని ప్రకారం, లాంగ్ టర్మ్ ప్లాన్ 12 నెలలు కోసం అడ్వాన్స్ రీఛార్జ్ వారికీ 1 నెల రెంటల్ ఉచితంగా అందిస్తోంది. అంటే, మీరు గనుక 12 నెలల లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే, మీకు 1 నెల  ఫ్రీ రెంటల్ వస్తుంది కాబట్టి, మీకు మొత్తంగా 13 నెలల ఈ ప్లాన్ చెల్లుతుంది.

ఇక ఇందులోనే 3 నెలల రెంటల్ ఉచితంగా అందించే మరొక ప్లాన్స్ వుంది. ఈ ప్లాన్, మీరు పొందాలంటే 24 నెలల కోసం 2 సంవత్సరాల లాంగ్ టర్మ్ ప్లాన్ని రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేయడంతో మీకు 3 నెలల ఉచిత రెంటల్ దొరుకుతుంది. అంటే, మీకు మొత్తంగా ఈ ప్లాన్ 27 నెలల చెల్లుబాటుకాలంతో వస్తుంది. ఇక చివరగా, 4 నెలల ఉచిత రెంటాల అఫర్ ప్లాన్ విషయానికి వస్తే, దీనికోసం మీరు 36 నెలలు అంటే 3 సంవత్సరాలకు గాను అడ్వాన్స్ రీఛార్జ్ చేసేవారికి గరిష్టంగా 4 నెలల రెంటల్ ఉచితంగా అఫర్ చేస్తోంది. అంటే, ఈప్లానుతో మీకు మొత్తంగా 40 నెలల వ్యాలిడిటీ అందుతుంది.        

పైన తెలిపిన విధంగా ఈ అఫర్ ప్లాన్ను, ఈ ఉచిత రెంటల్ అఫర్ ప్లాన్స్, బ్రాడ్ బ్యాండ్, భారత్ ఫైబర్, ల్యాండ్ లైన్, BBo WiFi బ్రాండ్ బ్యాండ్ ప్లాన్స్ మరియు DSL వంటి అన్ని సర్వీసుల పైన వర్తింప చేసింది.                                                                      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :