రిలయన్స్ జియో తన వినియోగదారులకు అనేక గొప్ప ప్లాన్స్ అందిస్తుంది. దీని పోర్ట్‌ఫోలియోలో 1GB డేటా నుండి 3GB వరకు రోజువారీ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. అదనంగా, సంస్థ తన ప్లాన్స్ తో జియో యాప్స్ కోసం ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ SMS లను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్ యొక్క సుదీర్ఘ జాబితాలో, మీ కోసం ఉత్తమ ప్రయోజనాలను అందించే మంచి ప్లాన్ ఎంచుకోవడం కొద్దిగా కష్టం. అందుకే గరిష్టంగా 504 జీబీ వరకు డేటా వినియోగాన్ని అందించే జియో యొక్క టాప్ 5 ప్లాన్స్ గురించి ఈ రోజు తెల్సుకుందాం.
జియో యొక్క రూ .149 ప్లాన్ 24 రోజులు చెల్లుతుంది మరియు ఈ ప్లాన్ లో జియో ప్రతి రోజు 1 GB డేటాతో మొత్తంగా 24 జిబి డేటాను అందిస్తుంది. రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ అందించే ఈ కార్యక్రమంలో జియో నెట్‌వర్క్ పరిధిలో కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేయడానికి, 300 నిమిషాలు అందించబడతాయి. ఈ ప్లాన్ యొక్క మరొక లాభం ఏమిటంటే ఇది జియో యాప్స్ ఉచిత సభ్యత్వంతో వస్తుంది.
రోజుకు 1.5 జీబీ డేటాను అందించే ఈ ప్లాన్ 28 రోజుల వరకు చెల్లుతుంది. జియో-టు-జియో అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటుగా, జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి ఈ ప్లాన్ లో 1000 నిమిషాలు అందించబడతాయి. రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ అందించే ఈ ప్లాన్ వినియోగఃదారులకు జియో యాప్స్ కి ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తారు.
Jio యొక్క ఈప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుతుంది. ఈ ప్లాన్ మీకు ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తుంది. అలాగే, జియో నెట్‌వర్క్ కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంది. అదే సమయంలో, ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్‌గోయింగ్ కాల్స్ చేయడానికి 1000 నిమిషాలు అందించబడతాయి. ఈ ప్లాన్ జియో యాప్స్ కి ఉచిత సభ్యత్వంతో పాటుగా రోజుకు 100 ఉచిత SMS లను అందిస్తుంది.
Jio యొక్క ఈ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించే వినియోగదారులకు అనువైనది. ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 3GB డేటా ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్ 28 రోజుల వరకు చెల్లుతుంది మరియు Jio నంబర్లకు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి మీకు 1000 నిమిషాలు సమయం లభిస్తుంది. అధనంగా, జియో అప్లికేషన్స్ యొక్క కాంప్లిమెంటరీ షబ్ స్క్రిప్షన్ అందించబడుతుంది. మిగిలిన ప్లాన్ మాదిరిగానే, ప్రతి రోజు 100 ఉచిత ఎస్ఎంఎస్ అందించబడుతుంది.
ఈ ప్లాన్ 336 రోజులు చెల్లుతుంది మరియు రోజుకు 1.5GB డేటాతో మొత్తంగా 504 GB డేటాను అందిస్తుంది. రోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను అందించే ఈ ప్లాన్ లో జియో నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్ అందుబాటులో ఉంది. అదే సమయంలో, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 12,000 నిమిషాలు ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్ తో జియో యాప్‌కు ఉచిత చందా కూడా ఇవ్వబడుతుంది.