ఆధార్ eKYC వినియోగం మీద సుప్రీమ్ కోర్టు విధించిన ఆంక్షల కారణంగా, వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి రక్షణ గల కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ప్రభత్వం, కొత్త చేపట్టనున్న ప్రక్రియ ద్వారా వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశముండదు. ప్రస్తుతమున్న, ఆధార్ సంభందిత eKYC వలన తలెత్తుతున్న సెక్యూరిటీ సమాస్యల కారణంగా, ఈ కొత్త విధానాలని ప్రవేశపెట్టాలని చూస్తోంది ప్రభుత్వం.
కొత్త సిమ్ కార్డుల కోసం అమలుచేయనున్న ఈ కొత్త 'డిజిటల్ ప్రక్రియ' కోర్టు ప్రకటించిన విధానాలకు కట్టుబడేలా ఉండేలా చేసిన ఒక ఆప్ తో నడుస్తుంది. దీని ద్వారా, సిమ్ కార్డు కోరుకుంటున్న వినియోగదారుని యొక్క సరైన కొలతలు మరియు టైమ్ స్టాంప్ కలిగిన ప్రత్యక్ష ఫోటో జతచేయబడుతుంది. ఏజెంట్, దీనిని OTP ద్వారా ద్రువికరించిన తరువాత జారిచేస్తారు. చాల సులభంగా ఉంటుంది కాబట్టి, ఈ విధానం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, UIDAI మరియు టెలికామ్ విభాగం కూడా ఉమ్మడిగా తెలిపాయి.