DTH మరియు కేబుల్ చందాదారులకు ఊరట : టీవీ చానళ్లను ఎంచుకోవడానికి గడువు పెంచిన TRAI, మార్చి31 చివరి తేదీ
TRAI, జనవరి 31 వరకు విధించిన గడువును మార్చి31 వరకు పెంచింది.
కేబుల్ లేదా డిటిహెచ్ యూజర్లు తాము ఎంచుకున్న ఛానళ్ల కోసం లేదా తాము ఉపయోగించే వాటి కోసం మాత్రమే డబ్బును చెల్లించెల్లించే విధంగా, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), ఒక ఆదేశాన్ని జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. ముందుగా, 2018 డిసెంబర్ 29వ తేదీని గడువుగా ప్రకటించింది. కానీ, చందాదారులకి సరైన అవగాహన కలిగించడంలో, DTH మరియు కేబుల్ ఆపరేటర్లు విఫలమవ్వడంతో, ఈ గడువును 2019 జనవరి 31వ వరకు పొడిగించింది.కానీ, టీవీ ఛానళ్లను ఎంచుకోవడం చాల మందికి చాల కష్టతరంగా ఉన్నట్లు TRAI గుర్తించింది. అదే సమయంలో, DTH ప్రొవైడర్ మరియు కేబుల్ ఆపరేటర్లు, చందాదారుల కోసం సరైన ప్లాన్స్ అందించడంలో మరొకసారి విఫల మవ్వడంతో, ట్రాయ్ ఇప్పుడు మరొకసారి ఈ గడువును పొడిగించాల్సి వచ్చింది. ఇప్పుడు, ఈ గడువును మార్చి 31 వరకు పొడిగించింది.
ఎందుకు పొడిగించాల్సి వచ్చింది?
జనవరి 31 వ తేదీ వరకు వారికి కావాల్సిన ఛానళ్ల ఎంపికలను ఎంచుకోలేని కొంతమంది చందాదారులకు, వారు ఎంచుకొని చానళ్లను నిలిపివేయడంతో, ఈ విధానాలను అర్థచేసుకొలేని చాల మంది చందాదారులు ఇబ్బందులకు గురైన విషయాన్ని గుర్తించిన TRAI, అన్ని DTH మరియు ప్రధాన మల్టి సిస్టమ్ ఆపరేటర్ల (MSO) లతో, ఫిబ్రవరి 11 వ తేదీన ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో, వారికీ కావాల్సిన ఛానళ్ల ఎంపికను విడివిడిగా ఎంచుకోలేని వారికీ ఒక సరైన ఎంపికను 'బెస్ట్ ఫిట్ ప్లాన్ ' గా అందివచవలసిందిగా పేర్కొంది. ఈ 'బెస్ట్ ఫిట్ ప్లాన్ ' చందాదారుల యొక్క భాష మరియు వివిధ కళా ప్రక్రియ మిళితంగా ఉండేలా చూడాలని కూడా తెలియచేసింది. ఈ ప్లాన్, కొత్త ఫ్రేమ్ వర్క్ విధానాలతో మరియు చందాదారులకు మునుపటి ప్లాన్ యొక్క ధర కంటే ఎక్కువగా ఉండకుండా చూడాలని కూడా వివరించింది.
అలాగే, లాంగ్ ప్లాన్ చందాదారులకు వెసులుబాటు కలిపిచింది TRAI. ఎలాగంటే, ముందుగా లాంగ్ టర్మ్ ప్లాన్స్ తీసుకున్నటువంటి చందాదారుల యొక్క సర్వీసులలో ఎటువంటి మార్పు లేకుండా వారి యొక్క గడువు తేదీవరకు ఛానళ్లను అందించాలని TRAI పేర్కొంది. అంతేకాకుండా, కొత్త విధానాల ప్రకారంగా వారు వారికీ కావాల్సిన అదనపు చానళ్లను ఎంచుకోవడనికి కూడా వారు అర్హత పొందుతారు. అయితే, వారు అదనంగా ఎంచుకునే చానళ్లకు రుసుమును చెల్లించాల్సివుంటుంది .
కాబట్టి, DTH మరియు కేబుల్ ఆపరేటర్లు చానళ్లను విడిగా ఎంచుకోలేని చందాదారులకు ఉపయోగపడే విధంగా ఒక "బెస్ట్ ఫిట్ ప్లాన్" సిద్ధం చేయాలనీ మరియు అప్పటి వరకు వారికి నచ్చిన పాత ప్లాన్లలో ఎటువంటి మార్పులు లేకుండా అందించాలని ఆదేశించింది. ఇవన్నీ జరగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, ఈ గడువును 2019 మార్చి 31 వ తేదీ గడువుగా తెలిపినది. ఈ తేదీ లోపుగా చందాదారులకు సరైన అవగాహన కల్పించాలని కూడా TRAI తెలిపింది. అలాగే, ఛానళ్లను మార్చుకున్న చందాదారులకు, మార్చి 31 వ తేదీ వరకు ఎటువంటి లాక్ -ఇన్ పిరియడ్ షరతులు విధించకూడదని చెప్పింది.