కొత్త నివేదిక ప్రకారం, భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన 4 జి సేవలను మార్చి 1 న ప్రారంభించనుంది. గతేడాది కేబినెట్ అందించిన పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4 జి సేవలను విడుదల చేస్తుందని మనకు ఇప్పటికే తెలుసు. ఇప్పుడు కొత్త అప్డేట్ లో, పిఎస్యు మార్చి 1 నుండి 4 G సేవలను ప్రారంభించడానికి 4 జి స్పెక్ట్రం విడుదల చేయడానికి టెలికమ్యూనికేషన్ విభాగాన్ని (DoT) సంప్రదించింది.
బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఐదేళ్లకు పైగా 4 జి సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నారు, చివరికి అది ఇప్పుడు నిజం కానుంది. ఇక 4 జి సర్వీస్ తో బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు వేగవంతమైన డేటా స్పీడ్ ను ఆస్వాదించగలదు. చాలా సర్కిళ్లలో, BSNL 2G మరియు 3G సేవలను అందిస్తోంది; ఇది ఇప్పటికే ఉన్న 3 జి స్పెక్ట్రం ఉపయోగించి 4 జి డేటా సేవలను కూడా అందిస్తోంది.
కొన్ని సర్కిళ్లలో, బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఉన్న 3 జి స్పెక్ట్రం ఉపయోగించి 4 జి సేవలను అందిస్తోంది, అయితే కంపెనీ తన 4 జి నెట్ వర్క్ ను మార్చి 1 న ప్రారంభించనుంది. స్పెక్ట్రం జారీ చేయమని లైసెన్సర్ ని కోరుతూ బిఎస్ఎన్ఎల్ DoT కి లేఖ రాసింది. 4 జి సేవలను ప్రారంభించడం, సంస్థ, ఈ పోటీలో ఉండాలనుకునే ప్రణాళికలో ఒక ముఖ్యమైన మైలురాయి.
క్యాబినెట్ గత సంవత్సరం బిఎస్ఎన్ఎల్ కోసం పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది, దీని కింద ఇది పనిచేస్తున్న అన్ని టెలికాం సర్కిళ్ళలో 4 జి సేవలను ప్రారంభించనుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ 4 జి, ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు చేరేముందు మొత్తం 20 సర్కిళ్లలో అధికారికంగా ప్రవేశపెట్టబోతోంది. అదనంగా, విలీనం చివరిలో MTNL కూడా BSNL కి సహాయకుడిగా పనిచేస్తుంది.
ఇంకా తెలియని వారికి బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కొన్ని ప్రాంతాల్లో 4 జిని అందిస్తోంది. హై-ఎండ్ బేస్ ట్రాన్స్ సీవర్ స్టేషన్లను (BTS ) ఉపయోగించి కంపెనీ ఈ సేవలను అందిస్తోంది. రాబోయే నెలల్లో, మొత్తం 20 టెలికాం సర్కిళ్లలో పూర్తిగా బిఎస్ఎన్ఎల్ 4 జి సేవలు అధికారికంగా తెలుస్తాయి.
ఇవే కాకుండా, మార్చి 1 న సేవ ప్రారంభమైన తర్వాత బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం కొత్త 4 జి ఓన్లీ ప్లాన్లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇది తాత్కాలిక లాంచ్ తేదీ కావచ్చు మరియు 4 జి స్పెక్ట్రం విడుదల సమయాన్ని బట్టి మారవచ్చు.