AI టెక్ దెబ్బకి బయటపడుతున్న SIM Card మోసాలు..మీ నెంబర్ చెక్ చేసుకోండి..!

AI టెక్ దెబ్బకి బయటపడుతున్న SIM Card మోసాలు..మీ నెంబర్ చెక్ చేసుకోండి..!
HIGHLIGHTS

ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సిస్టమ్ ASTR అద్భుతాలను చేస్తోంది

SIM Card Holders వెరిఫికేషన్ ను చేసేందుకు DoT కొత్త టూల్

గుజరాత్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుకు చెందిన కేసులు కూడా ఉన్నాయి

దేశవ్యాప్తంగా ఉన్న టోటల్ SIM Card Holders వెరిఫికేషన్ ను చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (DoT) తీసుకువచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సిస్టమ్ ASTR అద్భుతాలను చేస్తోంది మరియు అక్రమాలను అరికడుతుంది. రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు యావత్ దేశాన్ని నివ్వెర పరిచేలా చేశాయి. ASTR ఇప్పటికే నకిలీ పాత్రలతో SIM Card లను ఉపయోగిస్తున్న చాలా కేసులను పట్టుకుంది. ఇందులో, గుజరాత్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుకు చెందిన కేసులు కూడా ఉన్నాయి. 

ASTR అంటే ఏమిటి?

ASTR అంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫెషియల్ రికగ్నైజేషన్ పవర్డ్ సొల్యూషన్ ఆఫ్ టెలికాం సిమ్ సబ్ స్క్రైబర్ వెరిఫికేషన్ అని అర్ధం. ఇది ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ద్వారా సిమ్ కార్డ్ యూజర్ల వివరాలను మరియు ఫోటోలను వెరిఫై చేస్తుంది.

 ఈ సిస్టం రీసెంట్ గా తమిళనాడులో ఒకే ఆధార్ కార్డ్ పైన 100 పైగా SIM Cards ఉపయోగిస్తున్న వారిని గుర్తించి వారి సిమ్ కార్డ్స్ ను బ్లాక్ చేసింది. అయితే, అన్ని కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన వ్యక్తి దే అత్యధికమైన సిమ్ కార్డ్స్ జారీ అయిన కేసుగా నమోదయ్యింది. సదరు వ్యక్తి ఒకే ఫోటో ప్రూఫ్ తో ఏకంగా 658 సిమ్ కార్డ్ లను తీసుకున్నట్లు ASTR గుర్తించింది. 

ఒకవేళ మీకు కూడా మీ సిమ్ కార్డ్ లేదా మీ మొబైల్ నెంబర్ గురించి సందేహం ఉంటే, మీరు సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (DoT) యొక్క tafcop వెబ్సైట్ ను కూడా అందించింది. ఈ tafcop వెబ్సైట్ ను సంధర్శించి మీ మొబైల్ నంబర్ ను మరియు మీ పేరు ఉన్న అన్ని మొబైల్ నంబర్లను కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo