చాలా కాలంగా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తున్న ఏకైక టెలికం సంస్థగా BSNL పేరొందింది. ఎందుకంటే, ఈ ప్రభుత్వ టెలికం సంస్థ ఇప్పటికీ పాత ధరలకే తన రీఛార్జ్ ప్లాన్స్ ను అఫర్ అందించడమే కారణం. అయితే, కస్టమర్లకు కోరుకున్న లేదా అవసరమైన స్థాయిలో నెట్ వర్క్ ను పొందలేక BSNL కస్టమర్లు నిరాశ చెందుతునట్లు కొద చెబుతున్నారు. అయితే, ఇది అన్ని ప్రాంతాలకు కాకపోవచ్చు.
కానీ, గతంలో 'How To Port My Mobile Number To BSNL' అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయంగా చర్చలోకి వచ్చింది. మరి ఇదే విషయం గురించి మీరు కూడా తెలుసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ క్రింద సూచించిన విధంగా చేయండి. ఇలా చేస్తే ఒక వారం లోపలే మీ మొబైల్ నంబర్ ను BSNL కు పోర్ట్ చేసుకోవచ్చు.
మీరు పోర్ట్ చేయదలచిన SIM కార్డు నుండి 1900 కి PORT అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ను టైప్ చేసే పంపించాలి. అంటే, PORT 0123456789 ఈ ఫార్ మ్యాట్ లో 1900 కి మెసేజ్ పంపించాలి. తరువాత, మీరు ఎంటర్ చేసి పంపిన మోబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అదే, UPC Code (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. తరువాత, మీకు వచ్చిన పోర్టింగ్ నంబర్ ను మీ దగ్గరలోని BSNL సెంటర్ లేదా SIM స్టోర్‌లో చూపిస్తే అక్కడ మీకు కొత్త SIM ను అందచేస్తారు.
అయితే, దీనికోసం మీరు మీ ప్రూఫ్ జిరాక్స్ ను సమర్పించ వాల్సి ఉంటుంది. ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ వంటి ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలలో దేనినైనా మీరు ఇవ్వవచ్చు. మీరు వివరాలు అందించిన తరువాత రెండు లేదా మూడు రోజుల్లో మీ నంబర్ పాత నెట్వర్క్ నుండి డీ-యాక్టివేట్ అవుంతుంది మరియు BSNL నెట్వర్క్ లోకి యాక్టివేట్ చేయబడుతుంది. తరువాత, మీరు మీ అవసరానికి అనువైన BSNL ప్లాన్స్ ను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు.