మీరు ఇప్పటి వరకూ ఎన్ని సిమ్ కార్డ్స్ తీసుకున్నారో మీకు తెలియకుంటే, చాలా ఈజీగా తెలుసుకునే విధానం ఒకటి వుంది. మీరు ఎటువంటి తర్డ్ పార్టీ యాప్ లేదా మీ వివరాలతో నిండిన అప్లికేషన్ లాంటివి ఇవ్వవలసిన అవసరం లేకుండానే ఇది చేయవచ్చు. మీ మొబైల్ లేదా కంప్యూటర్ నుండి చాలా సింపుల్ గా ఈ వివరాలను చూడవచ్చు. కేవలం మీరు తీసుకున్న మొబైల్ నంబర్లు మాత్రమే కాదు వాటి వివరాలు మరియు ప్రస్తుతం వాడుకలో ఉన్న నంబర్లను కూడా మీరు తెలుసుకోవచ్చు.
టెలికం యూజర్లు తీసుకున్న అన్ని మొబైల్ నంబర్ వివరాలను మరియు వాటి యాక్టివ్ స్టేటస్ ను పారదర్శకంగా ఉంచడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఇటీవల తీసుకొచ్చిన కొత్త వెబ్సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవడం సులభతరమయ్యింది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు తీసుకున్న మొబైల్ నంబర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవచ్చు.
మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి.
OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ మాత్రమే వాడుకలో ఉంటుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది. ప్రస్తుతానికి , ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళా, రాజస్థాన్, జమ్మూ కాశ్మిర్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ కంజ్యూమర్లకు మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో వుంది.