DoT తిరస్కరణతో, కొత్త eKYC విధానాలను ప్రారంభించనున్నటెలికామ్ సంస్థలు

Updated on 06-Nov-2018
HIGHLIGHTS

Jio, Airtel, మరియు Voda - Idea వంటి టెలికామ్ సంస్థలు కొత్త eKYC విధానాలను ప్రారంభించనున్నాయి.

నవంబర్ 5, ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ కి చివరి గడువు కావడంతో, ఈ సమయాన్ని పెంచవలసిందిగా DoT (డిపార్టుమెంట్ ఆఫ్ టెలికామ్) కి టెలికామ్ కంపెనీలు చేసిన విన్నతిని తిరస్కారించడంతో, టెలికామ్ సంస్థలు కొత్త eKYC విధానాలను ప్రారంభించాయి.  ఆధార్ ఆధారిత దృవీకరణ పైన సుప్రీమ్ కోర్టు విధించిన ఆంక్షల ప్రకారం గడువును పెంచలేమని, DoT తెలియచేయడంతో ఈ కొత్త  eKYC విధానాలను చేపట్టనున్నాయి. అయితే, ప్రత్యామ్నాయ విధానాలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేవరకు ఈ ఆధార్ eKYC విధానాన్ని వాడుకోనున్నట్లు (పేరుచెప్పడం ఇష్టంలేని) కొంతమంది టెలికామ్ ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తోంది.

ఎయిర్టెల్ ఇప్పటికే, ఢిల్లీ, తూర్పు మరియు దక్షిణ ఉత్తరప్రదేశ్ లతోపాటుగా ఏడు మార్కెట్లలో, తన కొత్త వినియోగదారుల ధ్రువీకరణ ప్రత్యామ్నాయ మార్గాలని అవలంభిస్తోందని మరియు వీటిని అన్ని సర్కిళ్లలో పూర్తిగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.  అలాగే, వోడాఫోన్ ఐడియా కూడా ఇప్పటికే తన డెమోలను రెండుసార్లు DoT మరియు UIDAI లకు సమర్పించినట్లు చెబుతోంది. ఇదే మార్గంలో జియో కూడా తన కొత్త వినియోగదారుల ధ్రువీకరణ ప్రత్యామ్నాయ మార్గాలని అన్ని సర్కిళ్లలో అవలంభిస్తోందని చూస్తోంది.

ఈ విధానము, కాగిత వినియోగంలేకుండా మరియు వినియోగదారుల యొక్క ఫొటోలతో పాటుగా పూర్తివివరాలను కలిగి వుండేట్లుగా చూడవలసివుంటుంది. సుప్రీమ్ కోర్టు,  ఆంక్షలు విధించక ముందు వరకు అన్ని 90% వరకు కొత్త వినియోగదారుల ధ్రువీకరణ కేవలం ఆధార్ ఆధారితంగా జరిగింది. అంటే, దాదాపుగా 50 మిలియన్ల మొబైల్ నంబర్లను  ఆధార్ డేటాతో తీసుకొన్నవేనన్నమాట.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :