ప్రభుత్వ టెలికాం కంపెనీ అయినా BSNL ఇప్పుడు తన సరికొత్త బ్రాడ్ బ్యాండ్ ప్రణాలిక రూ. 299 ని ప్రకటించింది. ఈ బ్రాడ్ బ్యాండ్ ప్రణాళిక ద్వారా అపరిమిత కాలింగ్, అపరిమిత డేటా అందిచనున్నట్లు BSNL ప్రకటించింది. అంతేకాకుండా, ఈ ప్లాన్ ద్వారా 50 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది. అయితే, ఈ అఫర్ కేవలం కొత్తగా కనెక్షన్ తీసుకునేవారికి మాత్రమే కావడం, కొంచెం నిరాశపరచింది.
కానీ, ఈ బ్రాడ్ బ్యాండ్ ప్రణాళిక ద్వారా అందుకునే ప్రయోజనాలను చుస్తే, ఇది కచ్చితంగా ఉత్తమంగా ఉంటుంది. దీనితో, రోజంతా లోకల్/STD కాలింగ్ చేసుకోవచ్చు మరియు 10:30pm నుండి 6am వరకు కూడా ఉచిత కాలింగ్ కోసం అర్హత పొందుతారు.
ఈ ప్రణాళికతో, వినియోగదారులు రోజువారీ 1.5GB డేటాని పొందుతారు మరియు 50 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందుకుంటారు. అంటే, క్యాష్ బ్యాక్ ఈ ప్రణాళిక మొత్తంలో నుండి తగ్గిస్తే, ఇది 249 రూపాయలతో సమానం. అయితే, దీనిని 299 రూపాయలతో రీచార్జిచేసినతరువాత 18 రోజులలో దీనిని క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తారు. ఇది 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే, రోజువారీ 1.5GB డాటాతో మొత్తంగా 45GB డేటా ప్రయోజనాన్నిస్తుంది.