BSNL vs రిలయన్స్ జియో : వార్షిక ప్లాన్
ప్రస్తుతం, BSNL సరికొత్త రూ. 1,312 కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది.
BSNL సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటిస్తూ, టెలికం రంగంలో ఒక ఒరవడిని తీసుకొస్తోంది. గత సంవత్సరం, జియో ప్రకటించినటువంటి రూ.1699 వార్షిక ప్రీపెయిడ్ ప్రణాళికకు ధీటుగా BSNL కూడా రూ. 1699 మరియు రూ. 2099 వార్షిక ప్రీపెయిడ్ ప్రణాళికలను తీసుకొచ్చింది.
టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే ఉచిత ఆఫర్లను ప్రకటించింది జియో. ఈ విషయంలో కూడా, ఇటీవలి కాలంలో బిఎస్ఎన్ఎల్ దాని కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు ఉచిత డేటాని ప్రకటించి తాను కూడా తక్కువేమి కాదని నిరూపించింది. ప్రస్తుతం, మరొక కొత్త వార్షిక ప్రణాలికను మన ముందుకు తీసుకొచ్చింది.
BSNL రూ. 1,312 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఈ ప్లానుతో, BSNL రోమింగుతో సహా 24 గంటల ఉచిత స్థానిక మరియు ఎస్టీడీ కాల్స్ అందిస్తోంది. అయితే, ఈ BSNL ప్లానులో అనేక పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్లాన్ ఢిల్లీ మరియు ముంబైల తప్ప మిగిలిన ఇతర అన్ని సర్కిళ్లకు కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. BSNL ఈ సర్కిళ్లలో కార్యకలాపాలను కలిగి లేక పోవడమే కారణం. అయినప్పటికీ, ఈ ప్లాన్ మొత్తంగా 365 రోజులకు గాను 5GB డేటాను కలిగి ఉంటుంది. ఎక్కువగా డేటాను ఉపయోగించని చందాదారులకు ఈ ప్లాన్ సరిపోతుంది. ఎక్కువగా, కేవలం కాల్స్ కోసం ఒక ప్లాన్ తీసుకోవాలని కోరుకునేవారికి, ఇది కచ్చితంగా ఒక మంచి ప్లాన్.
అదనంగా, ఈ కొత్త రూ 1312 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లో చందాదారులందరూలు పూర్తి విశ్వసనీయతతో 1000 SMS లను పూర్తి వ్యాలిడిటీ కాలానికి ఆస్వాదించగలరు. అంతేకాదు, వీటి తోపాటు అదనంగా ఈ పూర్తి సంవత్సరానికి గాను వినియోగదారుడు హలో ట్యూన్లను ఎంజాయ్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.
జియో రూ. 1699 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
పూర్తి సంవత్సరానికి గాను జియో అందిస్తున్న, ఈ రూ. 1699 ప్రీపెయిడ్ ప్లానుతో వినియోగదారులు మంచి ప్రయోజనాలనే అందుకుంటారు. ఎందుకంటే, ఈ ప్లానుతో లోకల్ మరియు STD అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, రోజువారీ 100 SMS పరిమితితో 365 రోజులకు ఈ సేవను అందించవచ్చు. ఇక ముఖ్యంగా డేటా విషయానికి వస్తే, రోజువారీ 1.5 GB డేటా అందుకుంటారు, అదీ కూడా 4G స్పీడుతో. అంతేకాకుండా, జియో ఆప్స్ కి కూడా యాక్సెస్ పొందుతారు.
అయితే, ప్రైవేటు టెలికం కంపెనీలకు ధీటుగా ఈ ప్రభుత్వరంగ టెలికం సంస్థ, గట్టి పోటీని ఇవ్వడం గమనార్హం