BSNL vs జియో vs ఎయిర్టెల్ vs Vi : తక్కువ ఖర్చులో వచ్చే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్
తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలను తీసుకువచ్చే 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్
యూజర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు
BSNL, జియో, Vi మరియు ఎయిర్టెల్ అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్స్
బడ్జెట్ కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడేది తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలను తీసుకువచ్చే 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్. ఈ ప్లాన్స్ తక్కువ ఖర్చులోనే హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS సర్వీస్ లను అఫర్ చేసే విధంగా ఉండాలి. వాటినే యూజర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అందుకే, టెలికం సంస్థలు కూడా వారి కస్టమర్లను ఆకర్షించే విధంగా తక్కువ ఖర్చులో మరిన్ని ప్రయోజనాలతో కొన్ని బెస్ట్ ప్లాన్స్ అందించాయి. ఈరోజు BSNL, జియో, Vi మరియు ఎయిర్టెల్ అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
BSNL జియో యొక్క చౌకైన 28/30 రోజుల ప్లాన్
BSNL యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 153 రూపాయలకు వస్తుంది. ఈ రూ. 209 ప్లాన్ తో కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS లను అందిస్తుంది. అంతేకాదు, 28 రోజుల ఉచిత PRBT(పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్) తో కూడా వస్తుంది. BNSL యొక్క రెండవ ప్లాన్ 199 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 2 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
రిలయన్స్ జియో యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్
రిలయన్స్ జియో యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 209 రూపాయలకు వస్తుంది. వాస్తవానికి, రూ.155 రూపాయల ప్లాన్ ఉన్నాకూడా, అది కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. రూ.209 ప్లాన్ ప్రకారం, కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS లను అందిస్తుంది. అంతేకాదు, జియో యాప్ లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. జియో యొక్క రెండవ ప్లాన్ 239 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1.5 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
ఎయిర్టెల్ యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్స్
ఎయిర్టెల్ యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ రూ.179 రూపాయలకు వస్తుంది. వినియోగదారులకు ఇది 28 రోజుల కాలానికి గాను మొత్తం 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్ని నెట్‌వర్క్‌లకు 300 SMSలను అందిస్తుంది. అలాగే, ప్రైమ్ వీడియోలో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇక మరొక బెస్ట్ ప్లాన్ 265 రూపాయలకు వస్తుంది. ఇది డైలీ 1 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, ప్రైమ్ వీడియో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
వోడాఫోన్ ఐడియా యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్స్
Vodafone Idea చౌకైన 28 రోజుల ప్లాన్‌ను రూ.179 రూపాయలకు వస్తుంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు 28 రోజులకు గాను మొత్తం 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 300 SMSలతో సహా Vi సినిమాలు మరియు టీవీలకు ఉచిత యాక్సెస్ ఇవ్వబడుతుంది. Vi యొక్క రెండవ ప్లాన్ 269 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, Vi Movies & TV Basic కి యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here.