BSNL vs రిలయన్స్ జియో : లేటెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్

BSNL vs రిలయన్స్ జియో : లేటెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్
HIGHLIGHTS

లేటెస్ట్ గా BSNL మరియు జియో టెలికం ఆపరేటర్లు వాడుకలోకి తీసుకొచ్చిన వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం, మార్కెట్లో అందుబాటులో వున్న అన్ని టెలికం ప్లాన్స్ కూడా అమాంతంగా పెరిగిపోయాయి. అంతేకాదు, పెంచిన ధరలతో పాటుగా వ్యాలిడిటీ కాలానికి సరిపడే ఉచిత ఆఫ్ నెట్ (ఇతర నెట్వర్క్) నిముషాల కాలింగ్ మాత్రమే అందించాయి. వాస్తవానికి, ముందుగా పూర్తి కాలింగ్ ఉచితంగా ఉండగా ఇప్పుడది కొన్ని నిముషాలకే అందించాయి. కానీ ఆశ్చర్యకరంగా, కేవలం ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్ అయినటువంటి BSNL మాత్రమే ఎటువంటి పరిమితీలేని True Unlimited కాలింగ్ అందిస్తున్న ఏకైక ఆపరేటర్ గా నిలుస్తుంది.

అందుకోసమే, అసలు ఏ టెలికం సంస్థ ఎటువంటి ప్రయోజనాలను వారి వినియోగదారులకు అందిస్తోంది, అని కూలంకుషంగా తెలియచేస్తున్నాను. ఇక్కడ అందించిన ప్లాన్స్ అన్ని కూడా లేటెస్ట్ గా BSNL మరియు జియో టెలికం ఆపరేటర్లు వాడుకలోకి తీసుకొచ్చిన వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు. 

BSNL : రూ.153 ప్రీపెయిడ్ ప్లాన్   

ఈ BSNL యొక్క ప్రీపెయిడ్ ప్లాన్లతో, ఇతర టెలికం సంస్థలు విధిస్తున్న FUP లేదా ఇతర నెట్వర్క్ కాల్స్ లిమిట్ వంటి ఎటువంటి పరిమిలేకుండా, True Unlimited కాలింగ్ అందిస్తున్నఏకైక టెలికం ఆపరేటర్ గా BSNL నిలుస్తుంది. ఇక ఈ 153 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో పైన చెప్పిన విధంగా ట్రూ అన్లిమిటెడ్ కాలింగ్ మీకు దొరుకుతుంది.అలాగే, రోజువారీ 1.5 GB డేటా మరియు రోజుకు 100 SMS లు అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.  ఈప్లానుతో ఢిల్లీ మరియు ముంభై సర్కిళ్లలో MTNL కి కూడా రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.

BSNL : రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్   

ఈ BSNL యొక్క ప్రీపెయిడ్ ప్లాన్లతో, ఇతర టెలికం సంస్థలు విధిస్తున్న FUP లేదా ఇతర నెట్వర్క్ కాల్స్ లిమిట్ వంటి ఎటువంటి పరిమిలేకుండా, True Unlimited కాలింగ్ అందిస్తున్నఏకైక టెలికం ఆపరేటర్ గా BSNL నిలుస్తుంది. ఇక ఈ 429 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో పైన చెప్పిన విధంగా ట్రూ అన్లిమిటెడ్ కాలింగ్ మీకు దొరుకుతుంది.అలాగే, రోజువారీ 2 GB డేటా మరియు రోజుకు 100 SMS లు అందిస్తుంది. ఈ ప్లాన్ 81 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈప్లానుతో ఢిల్లీ మరియు ముంభై సర్కిళ్లలో MTNL కి కూడా రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.   

BSNL : రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్   

ఈ BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లానుతో, ఏకంగా 6 నెలల వరకూ True Unlimited కాలింగ్ అందిస్తున్నఏకైక టెలికం ఆపరేటర్ గా BSNL నిలుస్తుంది. ఇక విషయానికి వస్తే, ఈ ప్లానుతో పైన చెప్పిన విధంగా ట్రూ అన్లిమిటెడ్ కాలింగ్ మీకు దొరుకుతుంది.అలాగే, రోజువారీ 3 GB డేటా మరియు రోజుకు 50 SMS లు అందిస్తుంది. ఈ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే, ఈ ప్లానుతో ఢిల్లీ మరియు ముంభై సర్కిళ్లలో MTNL కి కూడా రోమింగ్ కాల్స్ చెయ్యలేరు.   

రిలయన్స్ జియో : రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క 129 రూపాయల రీఛార్జ్ వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మొత్తంగా 2GB డేటాతో పాటుగా జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం 1,000 నిముషాల FUP లిమిట్ తో వస్తుంది. అలాగే, మొత్తంగా 300 SMS ల పరిమితో ఉంటుంది . ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో : Rs.199  ప్రీపెయిడ్ ప్లాన్

మీరు రిలయన్స్ జియో యొక్క ఈ 199 రూపాయల రీఛార్జ్ ఒక నెలకు సరిపడే బెస్ట్ ప్లానుగా చెప్పొచ్చు. ఇది ఒక నెల రోజులకు రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 42GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందుబాటులో(జియో to జియో) ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో : Rs.249(AIO) ప్రీపెయిడ్ ప్లాన్

గేమింగ్,, మూవీస్ ఎక్కువ చూసే వారికీ జియో యొక్క ఈ 249 రూపాయల రీఛార్జ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, ఇది రోజువారీ 2GB డేటాతో మొత్తంగా 56GB డేటాతో వస్తుంది. అలాగే, అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (జియో to జియో) కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 1,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

జియో : Rs.555 (AIO) ప్రీపెయిడ్ ప్లాన్

మూడు నెలల కోసం రీచార్జి చేయాలనుకునే వారికి, రిలయన్స్ జియో యొక్క ఈ 555 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ నిజంగా సరిగ్గా సరిపోతుంది. ఇది రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 126 GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ (జియో to జియో) అందుబాటులో ఉంటాయి. అధనంగా, ఇతర నెట్వర్క్ల్ కాలింగ్ కోసం 3,000 నిముషాల టాక్ టైం దొరుకుతుంది. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 84 రోజులు, అంటే పూర్తిగా మూడు నెలలు చెల్లుబాటుతో వస్తుంది. దీన్ని MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo