BSNL Unlimited Plan: రూ. 900 కంటే తక్కువ ఖర్చుతో 6 నెలలు లాభాలు అందుకొండి.!

Updated on 11-Dec-2024
HIGHLIGHTS

యూజర్ల కోసం చాలా చవక ప్రీపెయిడ్ ప్లాన్ లను బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది

తక్కువ ఖర్చుతో 6 నెలల లాభాలు అందించే ప్లాన్ ను కూడా అందించింది

బిఎస్ఎన్ఎల్ అందించిన బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్

BSNL Unlimited Plan: యూజర్ల కోసం చాలా చవక ప్రీపెయిడ్ ప్లాన్ లను బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఎంత చవక అంటే రూ. 900 కంటే తక్కువ ఖర్చుతో 6 నెలల లాభాలు అందించే ప్లాన్ ను కూడా అందించింది. అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీల టారిఫ్ రేట్లు భారీగా పెరిగినా, బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటికీ ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను తాన్ యూజర్ల కోసం అందుబాటులో ఉంచింది.

BSNL Unlimited Plan:

బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ లాభాలతో బడ్జెట్ ధరలో అందించిన రూ. 887 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పోరుతో ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

Also Read: రిఫండ్ పేరుతో Myntra కి టోకరా: బెంగళూరు సిటీలో 1 కోటికి కొట్టేసిన స్కామర్లు.!

బిఎస్ఎన్ఎల్ రూ. 887 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 887 ప్లాన్ బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 180 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ కూడా అందిస్తుంది. అంతేకాదు, 180 రోజులకు గాను 90GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ 90GB డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది.

ఇది కాకుండా, ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 887 ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్, డేటా మరియు SMS వంటి అన్ని లాభాలు 6 నెలల (180 రోజులు) పాటు అందుకోవచ్చు.

మరిన్ని బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :