ప్రభుత్వ టెలికామ్ సంస్థ అయినటువంటి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ఇప్పుడు తన కొత్త ప్రకటనతో మిగిలిన అన్ని టెలికాం సంస్థలకు షాకిచ్చింది. BSNL యొక్క ప్రీపెయిడ్ ప్రణాళికలైనటువంటి, Rs 187, Rs 333,Rs 349,Rs 399, Rs 444 మరియు Rs 447 పైన కూడా ఈ 2.2GB రోజువారీ అధిక డేటాని వర్తింపచేసింది. ముఖ్యంగా, BSNL యొక్క వార్షిక ప్రణాళికలైన Rs. 1699 మరియు 2099 లకి కూడా ఈ రోజువారీ 2.2GB ని వర్తింపు చేసింది. నవంబరు 14 వ తేదీతో ఈ ప్రణాళికలు ముగుస్తుందని అనుకుంటుండగా ఈ ప్రణాళిక మీద వినియోగదారుల స్పందన అనుసరించి, ఈ వార్షిక ప్రణాళికలను జనవరి 2019 వరకు అందుబాటులో ఉంచుతుంది.
Rs 1699 ప్రీపెయిడ్ ప్లాన్
BSNL యొక్క వార్షిక Rs.1699 ప్లాన్ తో, లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, రోజువారీ 100SMS లు మరియు రోజువారీ 2GB డాటాతో మొత్తంగా 730GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ప్రస్తుత ప్రకటనతో దీని యొక్క రోజువారి డేటా 2GB నుండి 4.21GB కి చేరుకుంది. అంటే, ఈ ప్లాను ద్వారా ఇపుడు రోజువారీ 4.21GB డేటాని వాడుకోవచ్చు.
Rs 2099 ప్రీపెయిడ్ ప్లాన్
మరొక Rs. 2099 వార్షిక ప్రీపెయిడ్ ప్రణాళికతో, లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, డైలీ 100SMS పరిమితి మరియు రోజువారీ 4GB డాటాతో మొత్తంగా 1460GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. దీని యొక్క FUP పరిమితి దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఇప్పుడు దీనితో పాటు కూడా రోజువారీ 2.2GB అధిక డేటా అందుకుంటుంది. అంటే, దీని యొక్క రోజువారీ డేటా 4GB నుండి 6.21GB కి పెరుగుతుంది.