BSNL ఈ ప్లాన్ల పైన రోజువారీ 2 GB ఉచితముగా అందిస్తోంది

Updated on 06-Mar-2019
HIGHLIGHTS

ఇకవైపు, 4G అందిచడం కోసం ప్రణాళికలను చేస్తూనే, ప్రస్తుతం ఉన్నా కొన్ని ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రోత్సహించే ఉదేశ్యంతో గొప్ప లాభాలను అందిస్తోంది.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), తన 7 ప్రీపెయిడ్ ప్రణాళికల పైన రోజువారీ 2.2 GB అధిక డేటాని ప్రకటించింది.  BSNL యొక్క ప్రీపెయిడ్ ప్రణాళికలైనటువంటి, Rs 186, Rs 429,Rs 485,Rs 666, Rs 999, మరియు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్స్ అయినటువంటి Rs 1699 మరియు Rs 2099 పైన కూడా ఈ 2.2 GB రోజువారీ అధిక డేటాని అందించింది. అయితే, ముందుగా, నవంబరు 14 వ తేదీతో ఈ ప్రణాళికలు ముగుస్తుందని ప్రకటించినా, వీటిపైన వినియోగదారుల స్పందన అనుసరించి, ఈ వార్షిక ప్రణాళికలను జనవరి 2019 వరకు అందుబాటులో ఉంచింది.

ఇకవైపు, 4G అందిచడం కోసం ప్రణాళికలను చేస్తూనే, ప్రస్తుతం ఉన్నా కొన్ని ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రోత్సహించే ఉదేశ్యంతో గొప్ప లాభాలను అందిస్తోంది.        

అయితే,  ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన వినియోగ దారుల స్పందను అనుసరించి, BSNL మరొకసారి 6 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన అదే 2.2 అదనపు డేటా ఆఫరును కొనసాగించనున్నదని తెలుస్తోంది. కానీ, Rs 999 ప్లాన్ పైన మాత్రం ఈ ఆఫరును పొడిగించలేదు. ఇంకా, ఈ క్రింది తెలిపిన 6 ప్రీపెయిడ్ ప్లాన్లకు ఈ అఫర్ యొక్క ఆఖరి గడువు తేదీని 30.04.2019 గా చూపిస్తోంది.                

1. Rs 186 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.2GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 28 రోజుల వ్యాలిడిటీ.  

2. Rs 429 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.2GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 81 రోజుల వ్యాలిడిటీ.

3. Rs 485 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.7GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 28 రోజుల వ్యాలిడిటీ. అయితే, ముందుగా రోజువారీ 1.5GB దాటని అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను కూడా ఈ అదనపు డేటా ప్రయోజన జాబితాలోకి తీసుకొచ్చింది BSNL.

4. Rs 666 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.7GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 129 రోజుల వ్యాలిడిటీ.  

5. Rs 1699 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క వార్షిక Rs.1699 ప్లాన్ తో, లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, రోజువారీ 100SMS లు మరియు రోజువారీ 2GB డాటాతో మొత్తంగా 730GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ప్రస్తుత ప్రకటనతో దీని యొక్క రోజువారి డేటా 2GB నుండి 4.2GB కి చేరుకుంది. అంటే, ఈ ప్లాను ద్వారా ఇపుడు రోజువారీ 4.2 GB డేటాని వాడుకోవచ్చు.          

6. Rs 2099 ప్రీపెయిడ్ ప్లాన్

మరొక Rs. 2099  వార్షిక ప్రీపెయిడ్ ప్రణాళికతో,  లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, డైలీ 100SMS పరిమితి మరియు రోజువారీ 4GB డాటాతో మొత్తంగా 1460GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. దీని యొక్క FUP పరిమితి దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఇప్పుడు దీనితో పాటు కూడా రోజువారీ 2.2GB అధిక డేటా అందుకుంటుంది. అంటే, దీని యొక్క రోజువారీ డేటా 4GB నుండి 6.2GB కి పెరుగుతుంది.        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :