దేశంలో కొత్త స్కామ్ లు పుట్టగొడుగుల్లా పుట్టొకొస్తున్నాయి. ఇప్పుడు మరొక స్కామ్ మార్కెట్ లో వెలుగుచూసినట్లు బయటపడింది. BSNL యూజర్లను టార్గెట్ చేసుకొని స్కామర్లు నాయా మోసాలకు తెరలేపారు. వారి మాటలు నమ్మేరా, ఇక అంతే మీ ఇల్లు గుల్ల చేసేస్తారు. వాస్తవానికి, BSNL ని త్వరలో విక్రయించబోతున్నారని వచ్చిన కథనాలను షోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేసేశారు. అంతేకాదు, మరో 24 గంటల్లో BSNL సిమ్ నిలిపివేయబడుతుందని కూడా షోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఈ వైరల్ న్యూస్ లను సొమ్ముచేసుకోవడం కొత్త దందాగా మారుతుంది. మరి అసలు కథ ఏమిటో చూద్దామా.
అసలు విషయం ఏమిటంటే, BSNL సంస్థను ఆమ్మబోతున్నారని, మీ BSNL సిమ్ కార్డ్ 24 గంటల్లో బంద్ అవుతుందని, కస్టమర్ల KYC లు పూర్తిగా TRAI నిలిపివేసిందని, ఏవోవో కధనాలు షోషల్ మీడియా మరియు ఆన్లైన్లో వార్తల్లో తెగ ఉదరగోట్టాయి. అయితే, దీనిపై స్పందించిన PIB FactCheck షోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తమని (ఫేక్) అని తెల్చిచెప్పింది. BSNL అసలు ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇటువంటి బూటకపు వార్తలను నమ్మవదని కూడా సూచించింది. PIB FactCheck యొక్క ట్వీట్ ను ఈ క్రింద చూడవచ్చు.
https://twitter.com/PIBFactCheck/status/1607299672854663169?ref_src=twsrc%5Etfw
వాస్తవానికి, ఈ వార్తలు వస్తున్న నాటి నుండి చాలా మంది BSNL యూజర్లలో కొంత అనిశ్చితి ఏర్పడింది. వారి సిమ్ కార్డ్ బంద్ అవుతుందేమో, అని కూడా చాలామంది యూజర్లు సంధిగ్ధంలో పడిపోయారు. కానీ, BSNL వినియోగదారులు ఎటువంటి కంగారు పడాల్సిన పనిలేదు. ఇది ఒక తప్పుడు ప్రచారం మరియు పూర్తిగా అవాస్తవం.
స్కామర్లు షోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ న్యూస్ ను క్యాష్ చేసుకునే అవకాశం వుంది. ఎందుకంటే, ఈ న్యూస్ లను ఆధారంగా చూపిస్తూ, బూటకపు SMS లేదా లింక్ లను పంపించి మీ అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ. ఒక్కసారి మీ వివరాలు స్కామర్ల చేతికి చిక్కాయంటే, ఇక మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అందుకే, మీ పర్సనల్ డేటా మరియు బ్యాంక్ వివరాలు తెలియని వారికి ఎప్పుడూ షేర్ చేయకండి. ముఖ్యంగా, OTP ని మాత్రం ఎప్పుడూ షేర్ చెయ్యకండి. ఎందుకంటే, బ్యాంక్ లేదా మారే ఇతర సర్వీసులు కూడా మీ OTP వివరాలను అడగవు.