BSNL బెస్ట్ ప్లాన్: రూ.107 రీఛార్జ్ తో 50 రోజులు నిశ్చింతగా ఉండవచ్చు.!!

Updated on 27-Jun-2022
HIGHLIGHTS

BSNL కస్టమర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ వున్నాయి

BSNL రూ. 107 రీఛార్జ్ తో 50 రోజుల వ్యాలిడిటీ

3GB హై స్పీడ్ డేటా మరియు 200 మినిట్స్ ఉచిత కాలింగ్

చవక ధరకే తమ మొబైల్ నంబర్ ను ఉపయోగించాలనుకునే BSNL కస్టమర్లకు గొప్ప  ప్రీపెయిడ్ ప్లాన్స్ వున్నాయి. వీటిలో కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే కేవలం 200 రూపాయల కంటే మరింత తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందుకే, ఈరోజు మనం అత్యంత చవక ధరకే డేటా, ఉచిత కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా అఫర్ చేసే రూ.107 రీఛార్జ్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాము.

BSNL రూ. 107 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 107 రీఛార్జ్ చేసే వారికి  ఏకంగా 50 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు , ఈ వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 200 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ మినిట్స్ కూడా లభిస్థాయి. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 200 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్‌ ద్వారా 50 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

ఇక ఇటువంటి మరిన్ని లాభాలను అందించే మరొక బెస్ట్ ప్లాన్ గురుంచి మాట్లాడితే, BSNL రూ.197 ప్లాన్ గురుంచి చెప్పవచ్చు. ఈ ప్లాన్ కేవలం రూ.197 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ ఇన్ కమింగ్ కోసం తమ నంబర్ ను ఉపయోగించాలి అనుకునేవారికి సరైన ఎంపిక కావచ్చు.            

BSNL రూ.197 ప్లాన్

BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఈ ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడీటీ మాత్రం 150 రోజులకు వర్తిస్తుంది. అంటే, BSNL కస్టమర్లు కేవలం 200 రూపాయల కంటే తక్కవ ఖర్చుతోనే 5 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు.

మరిన్ని BSNL ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :